VB G RAM G: ఎలా కంప్లైంట్ చేసినా ఇక నో రిజెక్షన్! మీ గ్రామ సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం

గ్రామీణ ప్రాంత ప్రజల ఉపాధి, జీవనోపాధిని పెంపొందించే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (VB-G RAM G) పథకం అమలులో పారదర్శకత పెంచేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కీలక అడుగు వేసింది. పథకం అమలులో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 'గ్రీవెన్స్ రెడ్రెసల్ రూల్స్ - 2026' పేరుతో సరికొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కొత్త నియమాల ప్రకారం గ్రామీణులు తమ సమస్యలను ఎటువంటి అడ్డంకులు లేకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

పల్లె నుండి జిల్లా వరకు ప్రత్యేక వ్యవస్థ

రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా స్థాయిలో త్రిస్థాయి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి స్థాయిలోనూ ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార అధికారులను నియమిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షిస్తారు. ఆన్‌లైన్ లేదా డిజిటల్ నెట్‌వర్క్ ద్వారా సమర్పించే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా వ్యవస్థను డిజైన్ చేశారు.

VB G RAM G Grievance Redressal Rules 2026 Multi-Tier and Transparent System for Rural Schemes

ఏ రూపంలో ఇచ్చినా నో రిజెక్షన్!

ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు నేరుగా వెళ్లి అధికారికంగా దరఖాస్తు ఇవ్వవచ్చు, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు, కేంద్రం కేటాయించిన డిజిటల్ పోర్టల్ లో నమోదు చేయవచ్చు లేదా ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి కూడా తమ సమస్యను తెలియజేయవచ్చు. భాష సరిగ్గా లేదనో, దరఖాస్తు ఫార్మాట్ మారందనో లేదా విధానపరమైన చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయనో చెప్పి అధికారులెవ్వరూ ఫిర్యాదును తిరస్కరించడానికి వీల్లేదు. కాగితం రూపంలో వచ్చిన ఫిర్యాదులను అదే రోజు లేదా మరుసటి పనిదినం నాటికి డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేసి, అర్జీదారుడికి రసీదు సంఖ్యను అందజేయాల్సి ఉంటుంది.

సడెన్​గా మదర్ శాంక్షన్.. రాష్ట్రాలకు రూ. 25 వేల కోట్లు నిధుల విడుదల
సడెన్​గా మదర్ శాంక్షన్.. రాష్ట్రాలకు రూ. 25 వేల కోట్లు నిధుల విడుదల

15 రోజుల్లో సమస్య తేలాల్సిందే!

ఈ నిబంధనల ప్రకారం ప్రతీ ఫిర్యాదుపై నిర్ణీత కాలపరిమితిలోగా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఫిర్యాదు అందిన నాటి నుంచి 7 పనిదినాల్లోగా సంబంధిత అధికారి క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, రికార్డులను పరిశీలించాలి. అవసరమైతే బాధితుల వాదనలను స్వయంగా లేదా డిజిటల్ విధానంలో వినాల్సి ఉంటుంది. మొత్తంగా ఫిర్యాదు స్వీకరించిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను డిజిటల్ పోర్టల్ ద్వారా బాధితుడికి రాతపూర్వకంగా తెలియజేయాలి.

కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని!
కొత్త స్కీమ్ ఎఫెక్ట్.. సగానికి పైగా కూలీలకు దక్కని పని!

పరిష్కారం కాకపోతే పైఅధికారులకు ఆటో-ఎస్కలేషన్

ఒకవేళ కేటాయించిన 15 రోజుల సమయం పూర్తయినా సమస్య పరిష్కారం కాకపోతే, ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా తర్వాతి ఉన్నతాధికారి వద్దకు బదిలీ అవుతుంది. డిజిటల్ ట్రాకింగ్ విధానం ద్వారా ఫిర్యాదు నమోదు నుంచి పరిష్కారం అయ్యే వరకు ప్రతి దశనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సదుపాయం కల్పించారు. ఒకవేళ అధికారుల నిర్ణయం సంతృప్తికరంగా లేకపోతే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా చట్టంలో కల్పించారు. ఈ నయా రూల్స్‌తో గ్రామీణ ఉపాధి పథకంలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+