మీకు బైక్, కారు ఉందా? గుడ్‌న్యూస్ -వాహన ధ్రువపత్రాల చెల్లుబాటు గడువు మరో 3నెలలు పెంపు
దేశంలో వాహనదారులకు మరింత రిలీఫ్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది.
మోటార్ వెహికిల్స్ చట్టం 1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం అవసరమైన పత్రాల చెల్లుబాటు గడువును పొడిగించినట్టు పేర్కొంది. కారు, బైక్ లేదా ఇతర వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజస్ట్రేషన్‌తోపాటు ఇతర ధ్రువీకరణ ప్రతాలకు ఈ పొడగింపు వర్తిస్తుంది. పత్రాల కాలపరిమితి ముగిసినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా వాహనదారులు రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితిలో కేంద్రం ఈ మేరకు వెసులుబాటు కల్పించింది.

ఫిబ్రవరి 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య పత్రాలు చెల్లుబాటు గడువు ముగిసిన వాటికి తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి. ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసిన పత్రాలు జూన్ 30, 2021 వరకు చెల్లుబాటులో ఉన్నట్టుగానే పరిగణించాలని రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొంది. నిజానికి ఇది వరకు పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటు కాలన్ని తొలుత గతేడాది జూన్ 9 వరకు పెంచింది. ఆ తరువాత ఆ గడువు ఆగస్టు 9కి, అనంతరం డిసెంబరు 27 వరకు పొడిగించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1, 2021 వరకు పెంచిన ప్రభుత్వం అనంతరం మార్చి 31 పెంచింది. తాజాగా, ఇప్పుడు జూన్ వరకు పెంచుతున్నట్టు ప్రకటించి వాహనదారులకు ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications