ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు తప్పిన ముప్పు: పల్టీలు కొట్టిన కాన్వాయ్ కారు

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శరద్ పవార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది.

జీపు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనంలోని డ్రైవర్‌కు, కొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్, పోలీసులకు ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం ఆస్పత్రికి తరలించారు.

Vehicle in NCP chiefs convoy overturns on Mumbai-Pune Expressway, Sharad Pawar’s car passes safely

ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా, ఈ ప్రమాదం జరిగేకంటే ముందే, శరద్ పవార్ వాహనం అక్కడ్నుంచి వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. దీంతో ఎన్సీపీ శ్రేణలు ఊపిరిపీల్చుకున్నాయి. శరద్ పవార్ దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.

అంతేగాక, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ పార్టీలు శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+