కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో హై అలర్ట్
బెంగళూరు/హోసూరు: కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అత్తిబెలె బార్డర్ లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని హోసూరు సరిహద్దులోని అత్తిబెలె చెక్ పోస్టు దగ్గర కర్ణాటకకు చెందిన అన్ని వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
సరిహద్దులో తమిళనాడు, కర్ణాటక పోలీసులు, మిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. తమిళనాడు వైపు వెలుతున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న అన్ని వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.

తమిళనాడు బంద్ కారణంగా కర్ణాటక వాహనాలలో ఆ రాష్ట్రంలోకి వెళితే శాంతిభద్రతల సమస్యలు ఎదురౌతాయని రెండు రాష్ట్రాల పోలీసులు ముందు జాగ్రత చర్యలు తీసుకున్నారు. అదే విధంగా తమిళనాడు వాహనాలు బెంగళూరులోకి ప్రవేశించకుండ జాగ్రత్తలు తీసుకున్నారు.
తమిళనాడులోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకపోవడంతో ప్రయాణికులు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ సిఫ్ కాట్, హోసూరు చేరుకున్నారు. కర్ణాటక ఆర్ టీసీ బస్సులు, బీఎంటీసీ బస్సులు అత్తిబెలె చెక్ పోస్టు వరకు సంచరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications