"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్"

కేరళలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేరళ రవాణాశాఖ మంత్రి కే. బీ. గణేష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను 5 వేల మంది మహిళలతో ప్రేమాయణం జరిపానని ఇటీవల గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని SNDP జనరల్ సెక్రటరీ వెళ్లప్పళ్లి నటేషన్.. మంత్రి కే. బీ. గణేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు.

"మంత్రి కే. బీ. గణేష్ కుమార్ కు మహిళలు, గోల్డ్ అంటే పిచ్చి. అతడు కామాంధుడు. అతడు ఎప్పుడూ చీప్ మ్యానెర్ లో మాట్లాడుతాడు. వెంటనే పినరయి విజయన్ అతడిపై చర్యలు తీసుకోవాలి. మంత్రిగా ఉన్నవాళ్లు ఎవరైనా తాను 5 వేల మంది మహిళలతో ఎఫైర్ పెట్టుకున్నానని మాట్లాడుతాడా..? ఇలాంటి వారు కేబినెట్ కు మచ్చ. తక్షణమే గణేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్ ను డిమాండ్ చేస్తున్నా" అని SNDP జనరల్ సెక్రటరీ వెళ్లప్పళ్లి నటేషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రజా జీవితంలో మంత్రి గణేష్ కుమార్ ఓ ఫెయిల్డ్ పొలిటీషన్ అని.. గణేష్ కుమార్ భార్య కూడా అతడిపై ఫిర్యాదు చేసిందని నటేషన్ పేర్కొన్నారు. కేబినెట్ లో మిగతావాళ్లంతా సమర్థవంతంగా పనులు చేస్తుంటే ఇతడు మాత్రం మాయని మచ్చగా మారుతున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రి స్థానంలో ఉన్నవాళ్లు ఎవరైనా మహిళలపై ఇలా మాట్లాడుతారా..? తాను 5 వేల మంది మహిళలతో ఎఫైర్ పెట్టుకున్నానని అంటాడా..? తనతో ప్రేమ అంగీకరించని మహిళలు మూగవారని, నపుంసకులని అంటున్నాడు. ఇతడి వల్ల కేరళ రాష్ట్రం ప్రతిష్ఠ దెబ్బతింటోందని నటేషన్ పేర్కొన్నారు.

VellapalliNatesan Alleges on Ganesh Kumar Kerala Minister KB Ganesh Kumar Crazy for Women Gold

మరోవైపు మంత్రి గణేష్ కుమార్ భార్య బిందు మేనన్ ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. గణేష్ కుమార్.. తమ నివాసంలో వేరే మహిళలో ఉండటాన్ని తాను చూశానని కానీ గణేష్ తన తప్పు ఒప్పుకున్నాడని అందువల్ల పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2014లో పెళ్లి జరిగినప్పటి నుంచి తనతో అనేక ఇబ్బందులు పడ్డానని కానీ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+