గుజరాతీయులపై వెంకయ్య ప్రశంసలు, అక్కడే ఎక్కువని...
అహ్మదాబాద్: గుజరాతీయులు ముందుచూపు ఉన్న వారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోమవారం గుజరాత్‌లో ఆయన మాట్లాడారు.
సంస్కరణలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి అయిన సంస్కరణలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో ఎలాంటి ఆలసత్వానికి తావు లేదన్నారు. గుజరాతీయులు ముందుచూపు ఉన్నావారని ప్రశంసించారు.

దేశంలోని మిగతా ప్రాంతంలోని ముస్లింలతో పోల్చితే గుజరాత్‌లోని ముస్లింలలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి.. గుజరాత్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామన్నారు.
సమయం వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోడానికి ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడమన్నారు. భూసేకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చామని, బొగ్గు, ఇతర కీలక విషయాల్లోనూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణలపై ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఈ ఆర్డినెన్స్‌లే ఉదాహరణ అన్నారు. పాలనలో అలసత్వానికి తావులేదని చెప్పారు.












Click it and Unblock the Notifications