Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీతో టచ్‌లో: ఉప రాష్ట్రపతి అభ్యర్థి మొబైల్ ఫోన్ కనెక్షన్ కట్: ఆ పని చేయనంటూ హామీ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేస్తోన్న మార్గరెట్ అల్వాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తోన్న మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) ఆమె ఫోన్ కనెక్షన్‌ను కట్ చేసింది. కనెక్షన్‌ను తొలగించినట్లు మార్గరెట్ అల్వాకు నోటీసులను పంపించింది. కేవైసీని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. 24 గంటల వ్యవధిలో సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేస్తామనీ స్పష్టం చేసింది.

మార్గరెట్ అల్వా ఫోన్ కనెక్షన్ కట్..

ఫలితంగా- మార్గరెట్ అల్వా ఇబ్బందులకు గురయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎలాంటి ఫోన్లు రావట్లేదని, తాను ఔట్ గోయింగ్ కాల్స్ చేయలేకపోతున్నానని చెప్పారు. తన మొబైల్ కనెక్షన్‌ను పునరుద్ధరించాలని ఆమె ఎంటీఎన్‌ఎల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇకపై తాను భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడబోనని హామీ ఇచ్చారు.

బీజేపీ ఎంపీలతో..

బీజేపీ ఎంపీలతో..

ప్రతిపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల రేసులో మార్గరెట్ అల్వా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. తనకు పరిచయం ఉన్న కొందరు బీజేపీ ఎంపీలతో ఫోన్‌లో మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్, తటస్థంగా ఉంటోన్న బిజూ జనతాదళ్ ఎంపీలతోనూ ఆమె తరచూ ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని, తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోన్నారు.

ప్రతిపక్షాల మండిపాటు..

ప్రతిపక్షాల మండిపాటు..

ఈ పరిస్థితుల మధ్య ఆమె వినియోగించే ఎంటీఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ కట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ రంగు పులుముకొంది. ఉన్నట్టుండి ఆమె సిమ్‌కార్డ్‌ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తోన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ప్రతిపక్షాల అభ్యర్థిపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని, కనీసం ఫోన్ వినియోగించే సౌకర్యం కూడా లేకుండా చేస్తోందని మండిపడ్డారు.

 నియంతృత్వ ధోరణికి

నియంతృత్వ ధోరణికి


తన మొబైల్ ఫోన్ కనెక్షన్‌ను పునరుద్ధరించాలని, అలా చేస్తే- ఇక తాను బీజేపీ ఎంపీలతో ఫోన్‌లో మాట్లాడబోనంటూ హామీ ఇచ్చేంత వరకూ పరిస్థితి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నియంతృత్వ ధోరణికి ఇది పరాకాష్ఠకు చేరిందంటూ ఆరోపణలు సంధిస్తోన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన ముగియనుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అదే నెల 6వ తేదీన పోలింగ్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+