నూతన ఉపరాష్ట్రపతిగా, మోదీ ఛాయిస్ - వైసీపీ మద్దతు వారికే..!!
ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ధన్ కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది. ఉభయ సభల్లో ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది. కొత్త ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రధాని మోదీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికి ఇవ్వబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
కొత్త ఉపరాష్ట్రపతిగా
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 21వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. 22న నామినేషన్ల పరిశీలన, 25వరకు నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువుగా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఇక, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఇక.. ఈ ఎన్నిక కోసం ప్రధాని మోదీ ఇద్దరి పేర్లను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీహార్ కే అవకాశం ఇస్తారని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ లేదా నడ్దా లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతల సమాచారం.

ప్రధాని ఛాయిస్
రాజకీయంగా ఏ నిర్ణయమైన వ్యూహాత్మకంగా తీసుకునే ప్రధాని మోదీ తదుపరి రాష్ట్రపతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏపీలో మూడు పార్టీలు కూటమిగా ఉండటంతో... 21 మంది లోక్ సభ - 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరు కూటమి అభ్యర్ధికే మద్దతుగా ఓటింగ్ లో పాల్గొంటారు. కాగా, వైసీపీ ఎవరి వైపు నిలుస్తుందనేది చర్చ గా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీని ఇదే కూటమి ఓడించటంతో జగన్ నిర్ణయం పైన పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

వైసీపీ మద్దతు ఎవరికి
2018 సమయంలోనే టీడీపీ కూటమిలో ఉన్నా నాడు ఎన్డీఏ నిర్ణయాలకు జగన్ పార్టీ మద్దతు పలికింది. టీడీపీ ఆ తరువాత కూటమి నుంచి బయటకు రావటం.. 2019 లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల వరకు కేంద్రంలోని ఎన్డీఏ బిల్లుకు వైసీపీ షరతు లు లేకుండానే మద్దతుగా నిలిచింది. కాగా, ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల పైన కేసులు.. వరుస అరెస్టుల వేళ జగన్ ఎన్డీఏకే మద్దతిస్తారా అనేది కీలక అంశంగా మారింది. జగన్ కు ఇంకా బీజేపీ ముఖ్య నేతల పరోక్ష మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
అయితే, ఎన్డీఏ కూటమికి ఉప రాష్ట్ర పతి ఎన్నికలో గెలిచేందుకు పూర్తి మెజార్టీ ఉంది. రెండు సభల్లోనూ 786 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా.. అందులో గెలుపుకు 394 ఓట్లు అవసరం. కాగా, ఎన్డీఏకు 422 ఓట్ల మద్దతు ఉంది. అయితే, అవసరం లేకపోయినా బీజేపీ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీలతో మైత్రి కొనసాగించటం 2014 నుంచి కొనసాగుతోంది. అదే 2018 లో వైసీపీని బీజేపీకి దగ్గర చేసింది. వైసీపీకి ఏడుగురు రాజ్యసభ... నలుగురు లోక్ సభ సభ్యుల బలం ఉంది. మరి.. జగన్ ఈ ఎన్నిక విషయంలో వేసే అడుగు భవిష్యత్ రాజకీయాలకు కీలక మలుపు కానుంది.












Click it and Unblock the Notifications