కాటేసిన బ్లాక్ ఫంగస్: అతని రెండు కళ్లు తొలగించారు, ఆరు ఆస్పత్రుల్లో చికిత్స, 1.48 కోట్ల ఖర్చు

నాగ్‌పూర్: దేశంలో కరోనావైరస్ తగ్గుముఖం పడుతుండగా, బ్లాక్ ఫంగ్ మాత్రం ఆ మహమ్మారి నుంచిచ బయటపడినవారిని భయాందోళనలకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్ బారిన ఎక్కువగా కరోనా నుంచి కోలుకున్నవారే పడుతుండటం గమనార్హం. దేశంలో వేలాది మంది ఈ బ్లాక్ ఫంగస్ బారినపడి తమ అవయవాలను కోల్పోయారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడి ఏకంగా కోటిన్నర రూపాయలు ఆస్పత్రులకే పెట్టడం గమనార్హం.

కరోనా నుంచి కోలుకోగానే..

కరోనా నుంచి కోలుకోగానే..

మహారాష్ట్రలోని విదర్భలో గత సెప్టెంబర్‌లో నవీన్ పాల్ అనే వ్యక్తి కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నారు. అయితే, ఆ తర్వాత అతనికి పంటిలోనూ, కంట్లోనూ తీవ్రమైన నొప్పి రావడం మొదలుపెట్టింది. దీంతో ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్పత్రిలో చేరారు. నాగ్ పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి వచ్చి మరో ఆస్పత్రిలో కూడా చికిత్స పొందారు.

బ్లాక్ ఫంగస్ ప్రభావంతో.. నవీన్ పాల్ రెండు కళ్లను తొలగించారు..

బ్లాక్ ఫంగస్ ప్రభావంతో.. నవీన్ పాల్ రెండు కళ్లను తొలగించారు..

ఇలా సుమారు ఆరు ఆస్పత్రుల్లో నవీన్ పాల్ చికిత్స తీసుకున్నారు. అప్పటికీ ఆయనకు వచ్చింది బ్లాక్ ఫంగస్ అని గుర్తించని వైద్యులు నివారణకు వైద్యం అందించారు. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ అని గుర్తించి దానికి తగిన వైద్యం అందించారు. అయితే, నవీన్ పాల్ బతకాలంటే అతని ఎడమ కన్ను తీసేయాలని వైద్యులు చెప్పడంతో అతని బార్య వైశాలి అంగీకరించింది. దీంతో అతని ఎడమ కన్ను తొలుత తీసేశారు. ఆ తర్వాత మరో కన్ను కూడా తొలగించారు. దీంతో అతడు అంధుడిగా మారిపోయాడు. అంతేగాక, బ్లాక్ ఫంగస్ బారినపడిన ముఖంలోని కొంత భాగాన్ని తొలగించారు.

బాధితుడికి అండగా నిలిచిన భార్య

బాధితుడికి అండగా నిలిచిన భార్య

అయితే, తన భర్తలో బతకాలనే ఆశ కలిగించేందుకు ఓ కన్నును ఆపరేషన్ ద్వారా తిరిగి పొందవచ్చని అతనికి చెప్పినట్లు వైశాలి తెలిపింది. కళ్లు లేకున్నా తన భర్త బతకాలని కోరుకున్నట్లు ఆమె పేర్కొంది. కళ్లు లేకపోయినప్పటికీ ఆయన తమతోనే ఉంటారని చెప్పింది. లేదంటే ఆయనను తాము కోల్పోయేవారమని ఆవేదన వ్యక్తం చేసింది.

బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ. 1.48 కోట్లు ఖర్చు

బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ. 1.48 కోట్లు ఖర్చు

కాగా, నవీన్ పాల్‌కు బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడేందుకు ఆరు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. మొత్తం వైద్యం, శస్త్రచికిత్సలకు కలిపి మొత్తం రూ. 1.48 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. అయితే, నవీన్ పాల్ భార్య వైశాలి రైల్వేలో ఉద్యోగి. దీంతో ఆమె భర్త వైద్యానికి రూ. కోటి ఖర్చును రైల్వే శాఖ భరించింది. మిగితా 48 లక్షలను కట్టేందుకు తమకున్న ఓ ఇంటిని అమ్మేసినట్లు వైశాలి తెలిపింది. నవీన్, వైశాలి దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+