ఎందుకో తెలియదు: కత్తులు, రాడ్లతో నైజీరియన్లపై దాడి, యోగి సీరియస్(వీడియో)

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నైజీరియన్లపై కొందరు దుండగులు కత్తులు, రాడ్లు, ఇటుకలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నోయిడాలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నైజీరియన్లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. తమపై ఎందుకు దాడి చేశారో తెలియడం లేదన్నారు.

ఓ గుంపు వచ్చి కత్తులు, ఇటుకలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిందని తెలిపారు. సహాయం చేయండని అరిచిన కూడా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పోలీసులకు కూడా ఫోన్ చేయలేదని వాపోయారు.

చివరకు తమ కళాశాల సిబ్బంది కూడా సహాయం చేయకపోవడంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశామని బాధితులు తెలిపారు. 'గతంలోనూ మా చుట్టు పక్కల ఉండేవారు మీరు మా దేశంలో ఉండొద్దు' అంటుండేవారని, ఇలాంటి వారిని చూసి తాము ఏం మాట్లాడాలని అన్నారు. కాగా, బాధుతుడి ట్వీట్‌కు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించారు.

నైజీరియన్ల ట్వీట్‌కు స్పందించిన సుష్మా

నోయిడాలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని సుష్మాను నైజీరియన్లు కోరారు. నైజీరియన్లపై జరిగిన దాడిపై స్పందించిన సుష్మా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి.. నైజీరియన్లకు రక్షణ కల్పించాలని చెప్పారు. అంతేగాకుండా నిష్పక్షపాతమైన, న్యాయబద్ధమైన విచారణ జరిపించాలని ఆదేశించారు. కాగా, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, గ్రేటర్ నోయిడాలో మనీశ్ కారి అనే ఇంటర్మీడియట్ విద్యార్థి డ్రగ్స్ అధికంగా తీసుకోవడంతో స్థానికులు ఆగ్రహం చెందారు. నైజీరియన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విద్యార్థి ఉండే అపార్ట్ మెంట్ సమీపంలో ఉన్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నైజీరియన్ పై దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A disturbing video has emerged on a social media platform, which shows a group of people thrashing an African-origin man with a steel dustbin. Several instances of racist attacks on Africans in Greater Noida have been reported earlier.
Please Wait while comments are loading...