వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: నాగిని పాటకు స్టెప్పులేసిన ఎస్సై, కానిస్టేబుల్.. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో యూనిఫాంలో డ్యాన్స్ చేసినందుకు గాను ఒక పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. పోలీసు సిబ్బంది యూనిఫాంలో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి సస్పెండ్ చేశఆరు. యూపీలోని కొత్వాలీ జిల్లాలోని పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో జెండా ఎగురవేసిన అనంతరం ఇద్దరు పోలీసులు నాగిని పాటకు డ్యాన్స్ చేశారు..

ఫోన్ లో రికార్డు..
అక్కడే ఉన్న ఇతర పోలీసు సిబ్బంది కూడా వారిని ఎంకరేజ్ చేశారు. అయితే దీనిని ఎవరో ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియోను పరిశీలించిన పిలిభిత్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ పి, ఎస్‌ఐ సౌరభ్ కుమార్, కానిస్టేబుల్ అనూజ్‌లను సస్పెండ్ చేస్తున్న ట్లు తెలిపారు.

Video of SS, Constable dancing to Nagini song on Independence Day is going viral on social media

విధుల నుంచి తొలగింపు..
పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరిద్దరూ డ్యాన్స్‌ చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆ ప్రాంత సర్కిల్ అధికారి వీరేంద్ర విక్రమ్‌ను ఎస్పీ కోరారు. నిందితులైన పోలీసు సిబ్బందిని పోలీస్ స్టేషన్‌లో వారి విధుల నుండి తొలగించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 75వేల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు.

English summary
A police Sub-Inspector (SI) and a constable were taken off duty for "dancing in uniform" during the Independence Day celebration, an official said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X