వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video : జరిమానాకు బదులు ముద్దు... నడిరోడ్డుపై యువతితో పోలీస్ లిప్‌లాక్...

|
Google Oneindia TeluguNews

సాధారణంగా ఎవరైనా కోవిడ్ 19 నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు... అందుకు తగిన జరిమానా విధిస్తారు... ఎక్కడైనా అంతే కదా... కానీ సౌత్ అమెరికాలోని పెరూ దేశంలో మాత్రం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 నిబంధనలు పాటించని ఓ యువతికి పెనాల్టీకి బదులు ముద్దు పెట్టేశాడో పోలీస్ అధికారి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... పెనాల్టీకి బదులు కిస్‌ ఇస్తానని ఆ అమ్మాయే పోలీస్ అధికారికి చెప్పింది. దీంతో సదరు పోలీస్ అధికారి ఫైన్ సంగతి పక్కనపెట్టి ఆమెతో లిప్‌లాక్ చేశాడు. పెరూలోని లిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పెరూలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉంది. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కర్ఫ్యూ సమయంలో ఓ యువతి బయటకు వచ్చింది. ఇది గమనించిన పోలీస్ అధికారి ఆమె వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. నిబంధనలు ఉల్లంఘించినందుకు చేతిలో పెన్ పేపర్ పట్టుకుని జరిమానా విధించేందుకు సిద్దమయ్యాడు. కానీ ఇంతలోనే ఆ యువతి అతనికి దగ్గరగా జరిగి ఏదో మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో తెలియదు గానీ.. వెంటనే సదరు పోలీస్ ఆమెకు దగ్గరగా జరిగి మాస్క్ తొలగించాడు. ఆ వెంటనే లిప్‌ కిస్ ఇచ్చాడు. కొన్ని సెకన్ల పాటు ఇద్దరూ లిప్‌లాక్‌లో ఉన్న ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

Video shows policeman kissing woman instead of fining her in Peru

విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించిన యువతికి జరిమానా విధించాల్సిందిపోయి బహిరంగ ప్రదేశంలో లిప్‌లాక్ చేసి ఆ పోలీస్ అధికారి కూడా నిబంధనలు ఉల్లంఘించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో పెరూ పోలీస్ విభాగం అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది.

కాగా,పెరూలో ఇప్పటివరకూ 12,61,804 మంది కరోనా బారినపడగా... 44వేల మంది మృతి చెందారు. కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో గత నెల నుంచి పెరూలో మరోసారి లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
A police officer has been suspended in Peru after he was caught on camera kissing a woman he was going to fine for breaching COVID-19 curfew. The woman appeared to persuade him to swap the fine for a kiss in the video. The decision to suspend him was taken by the mayor of Miraflores district in the Peruvian capital Lima.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X