రైల్వే ఉద్యోగి చేతివాటం: రూ. 500 ఇస్తే.. రూ. 20నే ఇచ్చావంటూ మోసం (వీడియో)
న్యూఢిల్లీ: ఓ రైల్వే ఉద్యోగి చేతివాటం వెలుగులోకి వచ్చింది. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో నగదు ఆధారిత లావాదేవీ సందర్భంగా రైల్వే ఉద్యోగి ప్రయాణికుడిని మోసం చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ క్లిప్‌ను శుక్రవారం రైల్ విస్పర్స్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ పోస్ట్ క్యాప్షన్ ప్రకారం ఈ సంఘటన మంగళవారం జరిగింది. వీడియోలో.. టికెటింగ్ కౌంటర్ వెనుక కూర్చున్న వ్యక్తి డబ్బు మోసం చేస్తూ పట్టుబడ్డాడు. రూ. 500 నోటు తీసుకున్నప్పటికీ రైల్వే ఉద్యోగి ఆ నోటును రూ. 20తో భర్తీ చేసి, రూ. 125 టిక్కెట్‌ను జారీ చేయడానికి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తాడు. తనకు ఇచ్చిన రూ. 500 నోటీను దాచిపెట్టి రూ. 20 నోటు ఇచ్చావంటూ ప్రయాణికుడిని దబాయిస్తాడు. ఇలా ప్రయాణికుడిని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు.

ఈ వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది రైల్వే సేవా, ఢిల్లీ డివిజన్, ఉత్తర రైల్వే (డీఆర్ఎం ఢిల్లీ ఎన్ఆర్) దృష్టిని కూడా వెళ్లింది. ఈ పోస్ట్‌పై స్పందించిన సంబంధిత రైల్వే అధికారులు.. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వైరల్ కావడంతో.. పలువురు ఇంటర్నెట్ వినియోగదారులు కూడా వీడియోపై స్పందించారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు.. "చెన్నైలో ఇలా నాకు చాలాసార్లు జరిగింది. కొంతమంది రైల్వే ఉద్యోగుల సంఘటిత పోకిరితనం అటువంటి నేరాలలో మునిగిపోయేలా వారికి ధైర్యాన్ని ఇస్తుంది' అని పేర్కొన్నాడు.
#Nizamuddin station booking office
— RAILWHISPERS (@Railwhispers) November 24, 2022
Date 22.11.22
Rs 500 converted into Rs 20 by the booking clerk.@GM_NRly @RailwayNorthern @drm_dli @RailMinIndia @AshwiniVaishnaw @IR_CRB @RailSamachar @VijaiShanker5 @PRYJ_Bureau @kkgauba @tnmishra111 @AmitJaitly5 pic.twitter.com/SH1xFOacxf
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇతరులను మోసం చేసి డబ్బును దోచుకోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. కాగా, ఈ వీడియో 195,000 మంది వీక్షించగా, 3,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.












Click it and Unblock the Notifications