పట్టపగలే.. బీఎండబ్ల్యూ కారు అద్దాలు పగలగొట్టి, రూ. 13 లక్షలు చోరీ: వీడియో వైరల్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలు దొంగలు తెగబడ్డారు. ఓ కారు అద్దాలు పగలగొట్టి.. అందులోని రూ. 13 లక్షలను ఎత్తుకెళ్లారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ చోరీ జరగడం గమనార్హం. అయినా ఎవరూ స్పందించకపోవడం శోచనీయం. అయితే, అక్కడి సీసీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యింది. దీంతో ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగలు స్థానికంగా నిలిపి ఉంచిన ఓ బీఎండబ్ల్యూ కారు వద్ద తచ్చాడుతూ కనిపించారు. ఒకరు బండిపైనే ఉండగా.. మరొకరు కారు డ్రైవర్ వైపు ఉండే అద్దాన్ని ధ్వంసం చేసి.. అక్కడ్నుంచి లోపలికి దూరాడు. ఆ తర్వాత కారులోని రూ. 13 లక్షల నగదుతో ఉన్న సంచిని తీశాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్‌పై అక్కడ్నుంచి పరారయ్యారు. నిందితులు తమను గుర్తించకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న సర్జాపూర్ పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
#WATCH | Rs 13 lakhs stolen from a parked car in Bengaluru on 20th October; case registered, say police.
— ANI (@ANI) October 23, 2023
(Video source: Bengaluru Police) pic.twitter.com/u8V4K5tGzI
అయితే, పట్టపగలే దొంగలు ఇలా చోరీకి పాల్పడినప్పటికీ.. అక్కడున్న ఎవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం. ఎవరైనా స్పందించి అప్పుడే పోలీసులకు సమాచారం ఇవ్వడమో.. స్థానికులను అప్రమత్తం చేయడమో చేసివుంటే దుండగులు అప్పుడే దొరికే అవకాశం ఉండేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications