చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చిక్కులున్న మాట నిజమే': విజయకాంత్ ప్రకటనతో ఖాళీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాట ఎన్నికల్లో ఆయన శైలి విలక్షణం. అభిమానులు ముద్దుగా కరుప్పు (నల్ల) ఎంజీఆర్‌ పిలుచుకుంటారు. ఆయన మాట్లాడిన ఒకే ఒక మాట ఇప్పుడు ఆ పార్టీని దయనీయ స్థితిలోకి నెట్టేసింది. ఆయన మరెవరో కాదు డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్‌.

ఈ ఏడాది మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ డీఎండీకే ఒంటిరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు తమిళ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఉన్న విజయ్ కాంత్ పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

చెన్నైలోని స్థానిక కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయం బోసిపోయింది. అసలే ఎన్నికల సమయం, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాలు టిక్కెట్లను ఆశించే అభ్యర్ధులతో కిక్కిరిసి పోతుంటే ఇక్కడ మాత్రం ఈగలను తోలుకుంటున్నారు.

పార్టీ టిక్కెట్ల కోసం పోటీ పడి దరఖాస్తు చేసిన నేతలు, ఇపుడు.. తమకు టిక్కెట్‌ వద్దు మహాప్రభో.. తమను వదిలిపెట్టండి అంటూ ప్రాధేయపడుతున్నారు. దీంతో విజయకాంత్ తీవ్ర నిరాశతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది.

 చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


ఈ ఎన్నికల్లో డీఎండీకే 29 సీట్లను కైవసం చేసుకుంది. అప్పటివరకు అధికారంలో ఉన్న డీఎంకే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో అన్నాడీఎంకేకు మిత్రపక్షమైనా, అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా స్థాయిని కల్పించారు.

చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


ఆ తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని 14 సీట్లలో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అంతేకాదు డీఎండీకే పార్టీ ఓటు బ్యాంకు సైతం 10 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే, బీజేపీలు ఎన్నోవిధాలుగా ప్రయత్నించాయి.

చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


అయితే విజయకాంత్ మాత్రం ఆ పార్టీ వినతులను తోసిరాజని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగా పోటీ చేయనట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు విజయకాంత్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన కొందరు నేతలు ఒక్కసారిగా జారుకున్నారు.

చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


నిజానికి విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కంటే.. తన నాయకత్వంలోనే పొత్తు పెట్టుకోవాలని ఆయన భావించారు. తమిళనాడులోని చిన్న పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార బరిలోకి దూసుకెళ్లాలని అనుకున్నారు.

 చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


అయితే ఉన్నట్టుండి విజయకాంత్ ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. విజయకాంత్ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉంది ఒక్క ఎండీఎంకే పార్టీ మాత్రమే. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో సోమవారం ప్రకటించారు.

చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని చిక్కులు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని పరిష్కరించుకుంటామన్నారు. ఇప్పటికే నాలుగు పార్టీల కూటమి ఏర్పడిందని డీఎండీకే తమతో చేతులు కలిపితే తమిళనాడులో విజయం ఖాయమన్నారు.

 చిక్కులున్న మాట నిజమే: వైగో

చిక్కులున్న మాట నిజమే: వైగో


పొత్తు విషయంలో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, విజయకాంత్ తమతో చేతులు కలుపుతారని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తున్నామన్నారు. తమ నాలుగు పార్టీలు ఈ విషయంపై చర్చలు జరిపామని, విధి విధానాలు కూడా ఖరారు అయ్యాయని వైగో తెలిపారు.

English summary
Vijayakanth says DMDK to contest alone in Tamil Nadu assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X