పాడే మోసేందుకు ఒక్కరు రాలే.. కానీ కర్మకు మాత్రం తండోపతండాలుగా వచ్చారు..

బీహర్‌లో దారుణ ఘటన జరిగింది. అరియా జిల్లా బిష్ణుపురలో చిన్నారులు పేరంట్స్‌ను పొగొట్టుకున్నారు. నాలుగు రోజుల్లో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్ చనిపోగా..ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇంతలోనే తల్లి ప్రియాంకాదేవి క‌రోనా సోకి చనిపోయింది. ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బంధువులెవ్వరూ వారిని పట్టించుకోలేదు. కనీసం పలకరించలేదు. దీంతో ఏం చేయాలో ఆ చిన్నారులకు అర్థం కాలేదు.

తల్లిండ్రుల అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించటానికి ఏం చేయాలో కూడా తెలియలేదు. గ్రామ‌స్తుల సహాయం చేయమని కన్నీటితో వేడుకున్నారు. ఒక్కరి మనస్సు కరగలేదు. 18 ఏళ్ల సోని. తండ్రిని..చెల్లిని గుండెల్లో పెట్టుకుని త‌ల్లిదండ్రుల మృత‌దేహాలకు అంత్య‌క్రియలు నిర్వ‌హించింది. తరువాత త‌ల్లిదండ్రుల‌కు ద‌శ‌దిన క‌ర్మలు కూడా చేశారు. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి జరగాలని అన్ని కార్యక్రమాలు నిర్వహించి భోజనాలు పెట్టారు. అంతకు ముందు సహాయం చేయటానికి ఎవ్వరూ రాలేదు కానీ..దశదిన కర్మల భోజనాలు చేయటానికి మాత్రం గ్రామంలో 150 మంది వ‌చ్చారు.

villagers not help for last rites.. but attend to eat shradh bhoj..

Recommended Video

    వివాదం లో KGF స్టార్ Yash | Hassan లో సంఘటన || Oneindia Telugu

    భోజనం చేశాక.. మీ అమ్మానాలు ఆసుపత్రిలో ఉండగా.. చికిత్స కోసం డబ్బులిచ్చాం.. మాకీ ఇవ్వాలని అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ మాటలు విన్న ఆ చిన్నారులకు నోట మాట రాలేదు. ఏం చేయాలో.. ఏం చెప్పాలో అర్థం కాలేదు. తమ కన్న వారిమీద మాట పడకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో తమ దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బులు వారికి ఇచ్చేశారు. ఇలా తమ వద్ద ఉన్న కొద్దీ డబ్బులను కూడా తీసుకున్నారని ఆ అనాధలు చెప్పుకొని బోరున విలపించారు. తల్లిదండ్రుల ఆత్మలు శాంతించాలని అలా చేశామని పెద్ద మనసుతో చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+