భిక్షగాళ్లు అనుకుంటున్నారా ?, చీరలు, కోళ్లు బీజేపీ నాయకుల ముఖం మీదకొట్టి ?
బెంగళూరు/మండ్య: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కొందరు నాయకులు అనుకుంటున్నారు. పలు నియోజక వర్గాల్లోని నాయకులు భారీ మెజారిటీతో విజయం సాధించాలని అనుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచి సాంత్రం వరకు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు పిలుచుకుని వెళ్లడానికి పలువురు నాయకులు నానా తంటాలుపడ్డారు.
మంగళవారం రాత్రే చాలా మంది నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓటర్లకు ముడుపులు చెల్లించుకున్నారు. అయితే బీజేపీకి ఓటు వెయ్యాలని వెళ్లిన కొందరు నాయకుల ముఖం మీద ఓటర్లు చీరలు, కోళ్లు విసిరికొట్టడం కలకలం రేపింది. మండ్య జిల్లాలో జేడీఎస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. మండ్యలో ఎలాగైనా బోణి కొట్టాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మండ్య జిల్లాలోని కేఆర్ పేట్ నియోజక వర్గం నుంచి మంత్రి నారాయణ గౌడ బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నారాయణగౌడ అనుచురులు ఓ గ్రామంలో బీజేపీకి ఓటు వెయ్యాలని చీరలు, కోళ్లు ఇంటింటికి పంపిణి చేశారు. మొదట చీరలు, కోళ్లు తీసుకున్న గ్రామస్తులు తరువాత తిరగబడ్డారు.
చీరలు, కోళ్లు తీసుకుని వెళ్లి గ్రామంలోని బీజేపీ నాయకుల ముఖం మీద, కొందరు నాయకుల ఇంటి ముందు ఉన్న తలుపులకు విసిరికొట్టారు. మీ భిక్ష మాకు అవసరం లేదు. మేము బీజేపీకి ఓటు వెయ్యమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఒక్కసారిగా వందలాది మంది గ్రామాస్తులు ర్యాలీగా బీజేపీ నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్లి చీరలు, కోళ్లు విసిరికొడుతున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు.
What is happening in KR Pete assembly...#KarnatakaElections #Karnatakaelections2023 pic.twitter.com/7YIPFcsyLa
— Shashi S Singh 🇮🇳 (@Morewithshashi) May 10, 2023
గ్రామస్తులు చీరలు, కోళ్ల ఎత్తుకుని ర్యాలీగా వెళ్లి బీజేపీ నాయకుల ఇళ్ల ముందు విసిరేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రామంలోకి వస్తున్న కొందరు బీజేపీ నాయకుల కార్లు అడ్డుకున్న గ్రామస్తులు మీరు మా గ్రామంలోకి రాకూడదని, బీజేపీకి ఓటు వెయ్యమని తేల్చి చెప్పారు. కేఆర్ పేట్ లోని పలు గ్రామాల్లో ప్రజలు తిరగబడటంతో మంత్రి నారాయణగౌడకు మైండ్ బ్లాక్ అయ్యిందని తెలిసింది.












Click it and Unblock the Notifications