Violence: పొలిటికల్ వార్, 8 మంది సజీవదహనం, అధికార పార్టీ లీడర్ అరెస్టు, కిరాతకుడు, సీఎం ఫైర్ !
కోల్ కత్తా: రాజకీయ కక్షల కారణంగా ఓ పొలిటికల్ లీడర్ ను బాంబులువేసి దారుణంగా హత్య చేశారు. రాజకీయ నాయకుడు హత్యకు గురి కావడంతో అతని వర్గీయులు రెచ్చిపోవడంతో ఇద్దరు పిల్లలతో సహ 8 మంది సజీవదహనం అయ్యారు. ఈ విషయంలో సీఎం సీరియర్ అయ్యారు. 8 మంది సజీవదహనం కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చెయ్యాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు అధికార పార్టీకి చెందిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. 8 మంది సజీవదహనం కేసు పెద్ద వివాదానికి కారణం అయ్యింది. పొలిటికల్ లీడర్ హత్యకు ప్రతీకారంగా అతని వర్గీయులు కొన్ని ఇళ్లకు నిప్పంటించారు. ఇళ్లల్లో మహిళలు, పిల్లలు ఉన్న సమయంలో నిప్పంటించడంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు. గాయాలైన వారిలో చాల మంది పరిస్థితి విషమంగానే ఉంది. రాజకీయ కక్షల కారణంగా హత్యకు గురైన పోలిటికల్ లీడర్ అనుచరులు మారణకాండకు 8 మంది బలి అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలకు అమాయకులు బలి అయ్యారని ఇప్పటికే గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గరవ్నర్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం నష్టపరిహారం ప్రకటించారు. 8 మందిని దారుణంగా చితకబాదిన తరువాత వారి ఇండ్లకు నిప్పంటించారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటం కలకలం రేపింది.

పొలిటికల్ లీడర్ హత్య
పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లాలోని రామ్ పూర్ హట్ ప్రాంతంలో తృణమల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన నాయకుడు బాడు షేక్ అలియాస్ బాడు బాయ్ అనే వ్యక్తిని నాటు బాంబులు వేసి దారుణంగా హత్య చేశారు. టీఎంసీలో మాస్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాడు షేక్ హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి.

పిల్లలను ఇళ్లల్లో వేసి నిప్పు పెట్టిన కిరాతకులు
బాడు షేక్ హత్యతో రగిలిపోయిన అతని వర్గీయులు స్థానికుల మీద విరుచుకుపడ్డారు. బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు సుమారు 12 ఇండ్ల మీద పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన సమయంలో ఆ ఇండ్లల్లో మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారని ప్రత్యక్షసాక్షులు ఇప్పటికే పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇద్దరు పిల్లలతో సహ 8 మంది సజీవదహనం
బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు చేసిన ఆగడాలతో ఆ ప్రాంతంలోని 12కు పైగా ఇండ్లకు మంటలు వ్యాపించాయి. ఇండ్లకు మంటలు వ్యాపించడంతో అందులో నివాసం ఉంటున్న వారికి మంటలు అంటుకుని తీవ్రగాయాలైనాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహ మొత్తం 8 మంది సజీవదహనం అయ్యారు. రాజకీయ కక్షల కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మండిపడిన ప్రతిపక్షాలు
బాడు షేక్ హత్యకు ప్రతీకారంగా ఆ ప్రాంతంలో అరాచకాలు మొదలైనాయి. మంట్లో కాలిపోయి తీవ్రగాయాలైన అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు. గాయాలైన వారిలో చాల మంది పరిస్థితి విషమంగా ఉందని వెలుగు చూసింది. రాజకీయ కక్షల కారణంగా హత్యకు గురైన పోలిటికల్ లీడర్ అనుచరులు మారణకాండకు 8 మంది బలి అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

విచారం వ్యక్తం చేసిన గవర్నర్
రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలకు అమాయకులైన వ్యక్తులు బలి అయ్యారని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీష్ ధంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గరవ్నర్ జగదీష్ ధంకర్ సంతాపం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీకి చెందిన నాయకుడు హత్యకు గురి కావడం, రెండు వర్గాల మద్య జరిగిన గొడవల్లో 8 మంది సజీవదహనం కావడం కలకలం రేపింది.

సీఎం ఆదేశాలు
పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లాలోని రామ్ పూర్ హట్ ప్రాంతంలో జరిగిన హింసాకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించి వివారాలు సేకరించారు. 8 మంది సజీవదహనం కావడానికి కారణం అయిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాధితుల కుటుంబాలకు హామీ ఇచ్చారు.

ప్రధాన నిందితుడు.... అధికార పార్టీ లీడర్ అరెస్టు
ఇద్దరు పిల్లలతో సహ 8 మంది సజీవదహనం అయిన కేసుకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ సీరియర్ అయ్యారు. 8 మంది సజీవదహనం కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చెయ్యాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు అధికార పార్టీకి టీఎంసీకి చెందిన ప్రధాన నిందితుడు, రామ్ పురహట్ బ్లాక్ విభాగం అధ్యక్షుడు అనారుల్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం
రాజకీయ నాయకుల ఆగడాకుల బలి అయిన 8 మంది మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, ఇండ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం మమతా బెనర్జీ మీడియాకు చెప్పారు. 8 మందిని దారుణంగా చితకబాదిన తరువాత వారి ఇండ్లకు నిప్పంటించారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటం కలకలం రేపింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications