నడిరోడ్డుపై మహిళ చీర లాగిన ప్రత్యర్థులు... ఉత్తరప్రదేశ్ 'బ్లాక్ ప్రముఖ్' ఎన్నికల్లో చెలరేగిన హింస...
ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బ్లాక్ ప్రముఖ్ ఎన్నికల నామినేషన్లలో గురువారం(జులై 8) రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింస చెలరేగింది. లఖింపూర్ ఖేరి అనే ఓ గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారైన ఓ మహిళపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై ఆమె చీర లాగి దౌర్జన్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ మహిళ కూడా వెంట వెళ్లగా ఈ దాడి జరిగింది. మార్గమధ్యలో ప్రత్యర్థులు వారిని అడ్డగించి దాడికి పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

సిద్దార్థ్‌నగర్ ప్రాంతంలో యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మతా ప్రసాద్‌పై ప్రత్యర్థులు దాడి చేశారు.సీతాపూర్‌లో మున్నీ దేవి అనే ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ స్థానిక కార్యాలయానికి చేరుకోగా... అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. మున్నీ దేవి మద్దతుదారులు సైతం నాటు బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో కొంతమంది దుండగులు బీఎస్పీ నేత లాల్‌జీ వర్మ నుంచి నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. బీజేపీ నేత తేజస్వి జైస్వాల్ మనుషులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వర్మ ఆరోపించారు. కన్నౌజ్‌లో ఎస్పీ,బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఫతేపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల ముందే కాల్పులకు పాల్పడ్డారు. అభ్యర్థుల నామినేషన్ పేపర్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు సైతం బీజేపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని... బీజేపీయేతర అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు యత్నించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపించారు.
ఇటీవలి జిల్లా పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతకుముందు,జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. ప్రస్తుతం జరుగుతున్న బ్లాక్ ప్రముఖ్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
బ్లాక్ ముఖ్ ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా ఓటింగ్‌లో పాల్గొనరు. ఇందులో కేవలం బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. మొత్తం 825 బ్లాక్ ప్రముఖ్ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications