Violence: నపూర్ శర్మ ఎఫెక్ట్, ర్యాలీలో హింస, ఇద్దరి మృతి, పోలీసులకు తీవ్రగాయాలు, కాల్పులు, కర్ఫ్యూ !
రాంచీ/లక్నో/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై నపూర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో దేశం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో అయితే కొన్ని నగరాలు, పట్టణాలు రణరంగంగా మారాయి. నపూర్ శర్మ, నవీన్ జిందాలను బీజేపీ నుంచి బహిష్కరించినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లీం సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం మసీదుల్లో నమాజ్ ముగిసిన తరువాత వెంటనే నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన అల్లర్లలో ఇద్దరు చనిపోయి 10 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాంచీలో కర్ఫ్యూ అమలు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందోళనకారుల దాడుల్లో పలువురు పోలీసులకు తీవ్రగాయాలైనాయి.

బీజేపీ నాయకులకు తలనొప్పి
మహ్మద్ ప్రవక్తపై నపూర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో దేశం మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టడంతో నపూర్ శర్మ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఉత్తర భారతదేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలు రణరంగంగా మారాయి. నపూర్ శర్మ, నవీన్ జిందాలను బీజేపీ నుంచి బహిష్కరించినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు.

రాంచీలో రాద్దాంతం
రాంచీలో శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగించిన తరువాత ముస్లీం సోదరులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హనుమాన్ మందిర్ జంక్షన్ దగ్గరకు ర్యాలీ చేరుకునే సమయంలో సహనం కోల్పోయిన ఆ వర్గంలోని కొందరు రాళ్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో రాళ్లు దాడిలో పలువురు సామాన్య ప్రజలతో పాటు ర్యాలీ నిర్వహిస్తున్నవారికి గాయాలైనాయి.

లాఠీచార్జ్.... గాల్లోకి కాల్పులు
ఒక్కసారిగా పరిస్థితి చెయ్యిదాటిపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ముస్లీంలు, హిందువులు ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ సందర్బంలో పరిస్థితి అదుపు చెయ్యడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ సందర్బంలో రాళ్లదాడిలో పోలీసులకు గాయాలైనాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితి అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు.

ఇద్దరి మృతి, పోలీసులకు గాయాలు
రాంచీ నగరంలో జరిగిన హింసలో అనేక మందికి తీవ్రగాయాలైనాయి. తీవ్రగాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. అల్లర్లలో గాయాలైన ఇద్దరు చనిపోయారని రాజేంద్ర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు స్పష్టం చేశారు. మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై ఇద్దరు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల కారణంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో హింస చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications