• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ ఐడియా, ఓ కాకి.. కాల్ చేస్తే చాలు కాసులు కురవాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో గానీ.. ఓ యువకుడికి మాత్రం కాసుల పంట కురిపిస్తోంది. అంతేకాదు ఆ యువకుడి ఆలోచనకు డిమాండ్ - సప్లై సూత్రం అక్షరాలా వర్తిస్తోంది. సిగ్గు పడకుంటే సంపాదనకు కొరత లేదనే విషయాన్ని కూడా రుజువు చేస్తున్నాడు. ఆ క్రమంలో కాకితో కాసుల బేరం చేస్తూ హ్యాపీగా బతికేస్తున్నాడు. ఆ పని చేయడానికి ఎలాంటి నామోషీ లేకుండా ప్రజల అవసరాలు తీర్చుతూ ఉపాధి పొందుతున్నాడు.

 కావ్ కావ్.. అదే ఆయనకు ఉపాధి

కావ్ కావ్.. అదే ఆయనకు ఉపాధి

కర్ణాటక రాష్ట్రంలో కాకితో ఉపాధి పొందుతున్నాడు ఓ యువకుడు. రెండు చేతులా సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు సిగ్గు పడకుంటే ఉపాధి పొందడానికి ఎన్నో మార్గాలు ఉంటాయని నిరూపిస్తున్నాడు. ఉడుపి - మంగళూరు ప్రాంతాల మధ్యన ఉండే కాపు అనే టౌన్‌లో ఈ కథానాయకుడు కాకితో కాసుల బేరం చేస్తున్నాడు. కాకిని ఉపాధి వనరుగా మార్చుకున్న మొట్టమొదటి యువకుడు ఇతడే కావొచ్చేమో మరి. ఆనోట ఈనోట ఇతగాడి గురించి తెలిసి ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.

ఎవరైనా చనిపోయినప్పుడు హిందు సంప్రదాయ ప్రకారం మూడో రోజు, ఆ తర్వాత 11వ రోజున ఆ వ్యక్తికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి అంత్యక్రియలు జరిగిన చోట పెట్టడం ఆనవాయితీ. అలా పెట్టిన వంటకాలను కాకి తినాలని భావిస్తారు. ఆ తంతు ముగిశాకే తిథి భోజనాలు వడ్డిస్తుంటారు. అయితే ఉడుపి జిల్లా పరిధిలోకి వచ్చే కాపు టౌన్‌లో కాకిల కొరత ఉంది. దాంతో పిండ ప్రధానాల సమయంలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

గొర్రెల్లా కొనడం కాదు.. జగన్‌ను చూసి నేర్చుకోండి.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి చురకలుగొర్రెల్లా కొనడం కాదు.. జగన్‌ను చూసి నేర్చుకోండి.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి చురకలు

 కాకుల జాడ కానరాక.. ప్రశాంత్ పూజారికి డిమాండ్

కాకుల జాడ కానరాక.. ప్రశాంత్ పూజారికి డిమాండ్

పట్టణీకరణ వేగవంతమవుతున్న తరుణంలో కాకుల జాడ కానరాకపోవడం ప్రశాంత్ పూజారి అనే యువకుడిని కదిలించింది. దాంతో కాకిని తనకు ఉపాధిమార్గంగా మలచుకున్నాడు. దానికోసం కాకిని పెంచుకుంటూ పిండప్రదానాలకు, వైకుంఠ సమారాధనలకు కాకితో వాలిపోతూ కాసిన్ని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. దాన్నే వృత్తిగా మలచుకుని హ్యాపీగా ఫీలవుతున్నాడు.

అంతేకాదు ఈ విషయం అందరికీ తెలిసిలా సోషల్ మీడియా వేదికను వాడుకుంటున్నాడు. పిండప్రదానాలకు, సమారాధనలకు కాకి లభించును అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అలా క్రమంగా ప్రశాంత్ పూజారి ఆలోచన వర్కవుట్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటుండటం విశేషం. అంతేకాదు ఎవరికైతే అవసరముంటుందో వాళ్లే కారులో తీసుకెళ్లడం, దింపడం చేస్తున్నారట. అలా 500 రూపాయల నుంచి 3 వేల 500 రూపాయల వరకు ఛార్జీ చేస్తున్నాడట.

 సోషల్ మీడియా ప్రచారం.. ఫుల్ గిరాకీ

సోషల్ మీడియా ప్రచారం.. ఫుల్ గిరాకీ


ఇంతకు ఈ కాకి వ్యాపారం ప్రస్థానం ఎలా మొదలైందో ప్రశాంత్ పూజారి కొన్ని వివరాలు వెల్లడించాడు. అప్పుడెప్పుడో తమ ఇంటి ఎదురుగా ఉండే చెట్టు మీద నుంచి మూడు కాకి పిల్లలు కింద పడ్డాయట. వాటిని చేరదీసి సంరక్షించే క్రమంలో రెండు కాకులు చనిపోగా ఒక్కటి మాత్రమే బతికిందట. ఆ కాకికి రాజా అని ముద్దుపేరు పెట్టుకుని పెట్‌లాగా పెంచుకుంటున్నాడట.

ప్రశాంత్ పూజారి ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొద్దిరోజుల కిందట రోడ్డుప్రమాదంలో చనిపోతే.. మూడో రోజు పిండప్రదానం సందర్భంగా కాకి రాలేదు. చనిపోయిన వ్యక్తి పేరిట పెట్టిన ఆ వంటకాలు ముట్టలేదు. దాంతో కుటుంబ సభ్యులు తీరని వేదనకు గురయ్యారు. ఆ క్రమంలో 11వ రోజు వైకుంఠ సమారాధనకు కూడా ఇలాగే జరిగితే ఎట్లా అని విచారించే సమయంలో ఒకతను ప్రశాంత్ పూజారి గురించి చెప్పారు. అలా తన కాకితో వాలిపోయి ఆ తంతు ముగించాడట. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదట. అలా ప్రజల అవసరాలు తీర్చుతూ అదే కాకిని ఉపాధిమార్గంగా మలచుకున్నాడు ప్రశాంత్. కాకులు లేని ఆ ప్రాంతంలో ఇతగాడికి మంచి డిమాండ్ పెరగడం విశేషం.

English summary
Prashanth Poojary Kapu has stated that he will offer the services of the crow for uttarakriye a ritual performed by hindus. He giving service to people for uttarakriye and getting some money for his needs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X