viral video: కరోనాకు విరుగుడు ఇదే -గోమూత్రం తాగితే భారత్ నుంచి కొవిడ్ పరార్: బీజేపీ ఎమ్మెల్యే డెమో
''నేను సైన్స్ ను నమ్ముతానా, లేదా అనేది అప్రస్తుతం. గోమూత్రాన్ని మాత్రం కచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారిని ఓడించగల సూపర్ పవర్ గోమూత్రం మాత్రమే. ప్రతిరోజూ పరిగడపునే రెండు మూతల గోమూత్రాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగారంటే.. కరోనా మన దేశం నుంచే పరారైపోతుంది..'' అని సెలవిచ్చారు ఘనత వహించిన బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్..
BJP Baliya MLA surendra singh is advising people to have Gaumutra (Cow Urine ) for Corona treatment #coronavirus @RoflGandhi_ https://t.co/4TpraQwuTZ pic.twitter.com/9blJVe8bgx
— Rofl Crazy 🏹🚜 (@crazy143143) May 8, 2021
దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూ ప్రతిరోజూ 4వేల మందిని పొట్టనపెట్టుకుంటున్నది. రోజువారీ కొత్త కేసులు 4లక్షలకుపైగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు, వ్యాక్సిన్ల కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గబోదని, ఆగస్టు నాటికి థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినాసరే ఫ్రంట్ లైన్ వారియర్లు శాస్త్రీయ పద్ధతుల్లో పోరాడుతూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవీ పట్టని కొందరు ఛాందసవాదులు మాత్రం కరోనాకు విరుగుడంటూ వింత ప్రచారాలను చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలందరూ గోమూత్రం తాగాలని పిలుపునిచ్చారు..

కరోనా వైరస్ కు విరుగుడు గోమూత్రమేనని, దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గోమూత్రం తాగితే భారత్ నుంచి కొవిడ్ కచ్చితంగా పరారైపోతుందని బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన గోమూత్ర పానం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో వివరించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

గోమూత్రం సేవిస్తే ఒక్క కొవిడ్ వ్యాధినేకాదు, గుండె సంబంధిత రోగాలూ దరిచేరబోవని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా తాను ఆరోగ్యంగా ఉండటానికి కారణం గోమూత్రమేనని బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. పసుపును వేయించి, ముద్దలుగా చేసుకుని మింగడం కూడా ఆరోగ్యానికి మేలుచేస్తుందని అన్నారు. వీరేంద్ర సింగ్ సొంత రాష్ట్రం యూపీలో నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 372 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 28,076మందికి వైరస్ సోకింది. యూపీలో మొత్తం కేసులు 14,53,679కి, మొత్తం మరణాలు 14,873కు పెరిగాయి.












Click it and Unblock the Notifications