వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ఇళ్లలోకి చొరబడి చిరుత బీభత్సం -చిన్నారి సహా ఐదుగురికి గాయాలు -5గంటల హైటెన్షన్

|
Google Oneindia TeluguNews

చిరుతపులి పంజా దెబ్బకు కంటికి తీవ్రగాయమై, రక్తం కారుతుండగా ఓ తండ్రి బిగ్గరగా అరుస్తున్నాడు.. 'నా బిడ్డ ఎక్కడ.. ఆ మాయదారి పులి ఎటు పోయింది..'అని. ఆ పక్కనే, నెత్తుటి గాయాలున్న ఏడాది పాపను ఒడిసిపట్టుకుని విలపిస్తోంది మరో తల్లి.. ఆమె ముఖం, మెడపైనా గాయాలున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మొత్తం ఐదుగురికి గాయాలు కాగా, ఆ ప్రాంతమంతా భయంతో గజగజ వణికిపోయింది. ఇవీ, మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో బుధవారం కనిపించిన భీతావాహ దృశ్యాలు..

ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్‌కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్

ఇండోర్‌లో చిరుత దాడి..

ఇండోర్‌లో చిరుత దాడి..

మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్ సిటీలో శివారు లింబోది ప్రాంతంలో ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన ఆ చిరుత, ఇళ్లలోకి చొరబడి జనాన్ని గాయపర్చింది. నెత్తుటి గాయాలతో బాధితులతోపాటు ఆ ప్రాంతవాసులంతా భయంతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే, ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు..

 ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని..

ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని..

ఇండోర్ సిటీలోకి చొరబడ్డ చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించగా, వారిని కూడా చిరుత పరుగులు పెట్టించింది. ఓ పోలీసుపైనా దాడి చేసింది. ఇళ్లలోకి దూరిమరీ పిల్లాపెద్దల్ని గాయపర్చిన పులి.. దాదాపు ఐదు గంటలపాటు అక్కడివారిని అతలాకుతలం చేసింది. ఐదు గంటల హైడ్రామా తర్వాత.. నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో నక్కిన చిరుతను ఫారెస్టు సిబ్బంది ఎట్టకేలకు బంధించారు. దీనిపై..

చిరుతకు వైద్యం.. పాప సురక్షితం..

చిరుతకు వైద్యం.. పాప సురక్షితం..

ఇండోర్ లో చిరుత దాడి సమయంలో బిడ్డ కోసం ఏడుస్తోన్న తండ్రి వీడియోలు వైరల్ అయ్యాయి. పాపను చిరుత ఎత్తుకెళ్లిందేమోనని ఆ తండ్రి ఆందోళన చెందాడు. అయితే, స్వల్పంగా గాయపడ్డ ఆ పాపను తామే ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పడంతో తండ్రి కుదుటపడ్డాడు. గాయపడ్డ ఐదుగురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. కాగా, మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిరుతను బంధించామని, సరైన వైద్యం తర్వాత దానిని తిరిగి అడవిలో వదిలేస్తామని కమలా నెహ్రూ జూపార్క్ ఇంచార్జి ఉత్తమ్ యాదవ్ మీడియాకు తెలిపారు. ఇండోర్ లో చిరుత దాడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి.

హైదరాబాద్‌లో వింత శిశువు - చేప ఆకారంలో పుట్టిన బిడ్డ -mermaid syndrome వల్లేనన్న డాక్టర్లుహైదరాబాద్‌లో వింత శిశువు - చేప ఆకారంలో పుట్టిన బిడ్డ -mermaid syndrome వల్లేనన్న డాక్టర్లు

English summary
Panic struck a residential colony in the Indore district of Madhya Pradesh when a leopard attacked and injured five persons including three of a family on Thursday. The animal also injured one of the policeman who came to the spot for rescue. after hours of rescue operation, forest department crew captured wild creature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X