Viral Video : నీటి కాలుష్యం C/O ఢిల్లీ.. నురగలు కక్కుతోన్న యమునా నదిని చూడండి!
వాయు కాలుష్యానికి కేంద్రంగా ఉన్న మన దేశ రాజధాని ఢిల్లీ.. తాజాగా నీటి కాలుష్యానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. ప్రశాంతంగా బయటకు వచ్చి ఊపిరి తీసుకునేందుకు భయపడుతోన్న ప్రజలు ఇప్పుడు చుక్క నీటితో గొంతు తడిపేందుకు కూడా జంకుతున్నారు. పరవళ్లు తొక్కే యమునా నదిలో పెద్ద ఎత్తున నురగలు రావడం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
నీటిని కమ్మేసేలా నురగ..
ఇటీవల నివేదిక ప్రకారం యమునా నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. నిన్న మొన్నటి వరకూ వర్షాలు బాగా కురవడంతో నదిలో గతంలో కంటే ఆక్సిజన్ స్థాయి ఎక్కువైంది. అయితే, దీంతో పాటు నదిలో ఫీకల్ కోలిఫాం స్థాయి కూడా అధికమైందని నివేదికలో స్పష్టమైంది. తాజాగా నురగలు కక్కుతూ ప్రవహిస్తోన్న యమునా నది భయానక వీడియో వైరల్‌గా మారడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళింది కుంజ్ ప్రాంతానికి చెందిన ఈ వీడియోలో నది నీటిని కమ్మేసేలా తెల్లని నురగ ప్రవహిస్తూన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

భూగర్భ జలాలు సైతం..
యమునా నదిలో కనిపిస్తోన్న ఈ తెల్లని నురగకు ప్రధాన కారణం పెద్ద పెద్ద కర్మాగారాల నంచి వెలువడే రసాయనక వ్యర్థాలేనని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నీటితోపాటు నీటి ప్రవాహాల వల్ల భూగర్భ జలాలు పెద్దఎత్తున కలుషితం అవుతున్నాయి. తద్వారా ప్రజలు క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఈ ఏడాది సెప్టెంబరులో యమునా నదిలోని అన్ని ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఆ నమూనాల ఫలితాలు ఇక్కడి నీటి కాలుష్య తీవ్రత్తకు అద్దం పడుతున్నాయి. యమునా నదిని కాలుష్య కోరల్లోంచి రక్షించకపోతే అది పెను ప్రమాదంగా మారుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
#WATCH | Delhi: Toxic foam seen floating on the Yamuna River. Visuals from Kalindi Kunj. pic.twitter.com/5KSQRjerSC
— ANI (@ANI) October 18, 2024












Click it and Unblock the Notifications