శశికళకు జైల్లో ఏం ఫుడ్ పెట్టారో తెలుసా!: 8x10 అడుగుల గది
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీఐపీ ఖైదీగా చూడటానికి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులు నిరాకరించారు. సాదారణ ఖైధీలకు పెట్టే ఆహారం శశికళకు పెట్టారు.
గురువారం ఉదయం శశికళకు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పులిహోర పెట్టారు. పరప్పన అగ్రహార జైలుల్లో మహిళా ఖైధీల బ్లాక్ లోని మొదటి అంతస్తులో 8x10 అడుగుల విస్తీర్ణం కలిగిన సెల్ కేటాయించారు. బుధవారం రాత్రి జైలులో తయారు చేసిన రెండు చపాతి, కప్పు అన్నం, సాంబార్ శశికళకు ఇచ్చారు.

పాత మంచం...... పాత పరుపు
శశికళకు పరప్పన అగ్రహార జైల్లో పాత ఇనుప మంచం, పాత పరుపు ఇచ్చారు. సాదారణ ఖైదీలకు ఇచ్చే దుప్పటి, ఒక టవల్ ఇచ్చారు. అయితే చిన్నమ్మ శశికళకు గురువారం క్యాండిల్స్ తయారు చేసే పని అప్పగించలేదని సమాచారం.

నో చెప్పిన అధికారులు
సాదారణ ఖైదీలను ఎలా చూస్తారో శశికళను అలాగే చూస్తున్నామని, న్యాయస్థానం శశికళ, ఇళవరసి, దివాకరన్ లకు సాదారణ జైలు శిక్ష విధించిందని, అందుకే అందరు ఖైదీలను ఎలా చూస్తామో అలాగే వారిని చూస్తున్నామని కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ హెచ్ఎన్. సత్యానారాయణ్ తెలిపారు.

దివాకరన్ బెంజ్ కారు సేఫ్
బుధవారం రాత్రి పరప్పన అగ్రహార జైలుకు నిందితుడు దివాకరన్ టీఎన్ 09-బీఇ 5969 నెంబర్ బెంజ్ కార్లో వచ్చారు. అప్పటికే నాగనాథపుర మెయిన్ రోడ్డులోని పరప్పన అగ్రహార జైలు దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు దివాకరన్ బెంజ్ కారు ను సేఫ్ గా జైలు ఆవరణంలోకి తీసుకు వెళ్లారు.

శశికళను చూడాలని
గురువారం చిన్నమ్మను చూడటానికి ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో పరప్పన అగ్రహార జైలు దగ్గరకు వెళ్లారు. అయితే శశికళను చూడటానికి అనుమతి ఇవ్వమని సెంట్రల్ జైలు అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె అనుచరులు జైలు బయటే వేచి చూస్తున్నారు.

ముగ్గురు మాట్లాడుకోవడానికి
గురువారం శశికళ, ఇళవరసి, దివాకరన్ మాట్లాడుకోవడానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. బుధవారం సాయంత్రం ముగ్గరు కలిసే బెంగళూరు వచ్చారని, అంతలోనే అత్యవసరంగా మాట్లాడుకునే విషయాలు ఏం ఉంటాయని జైలు అధికారులు శశికళను ప్రశ్నించారని తెలిసింది.












Click it and Unblock the Notifications