వెయ్యి మంది పన్నీర్ సెల్వాలను చూశా: ఏం చేస్తారు, శశికళ
పన్నీర్ సెల్వం లాంటి వ్యక్తులను వెయ్యి మందిని చూశాను, ప్రత్యర్థులుగా ఎంత మంది మగాళ్లు వచ్చినా ఎదుర్కొంటానని, ప్రాణం పోయినా అన్నాడీఎంకే పార్టీని నిలబెట్టుకుంటానని,
చెన్నై: పన్నీర్ సెల్వం లాంటి వ్యక్తులను వెయ్యి మందిని చూశాను, ప్రత్యర్థులుగా ఎంత మంది మగాళ్లు వచ్చినా ఎదుర్కొంటానని, ప్రాణం పోయినా అన్నాడీఎంకే పార్టీని నిలబెట్టుకుంటానని అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అన్నారు.
పత్యర్థి డీఎంకే పార్టీతో చేతులు కలిపిన పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని శశికళ ఆరోపించారు. అందుకే తాను ప్రత్యక్షంగా ముందుకు వచ్చి పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నించానని, అందులో అధికార వ్యామోహం లేదని శశికళ చెప్పారు.
చెన్నైలో శశికళ మీడియాతో మాట్లాడారు. గతంలో రాజకీయాలు వద్దనుకున్న జయలలితను తానే బలవంతంగా ఒప్పించానని చెప్పారు. దాదాపు 33 ఏళ్లపాటు ఇద్దరం కలిసి అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటూ వచ్చామని, ఇద్దరు అబలలం కలిసి ప్రత్యర్థులను ఎదుర్కొన్నామని శశికళ భావోద్వగంతో చెప్పారు.

ఇప్పుడు నామీద తిరుగుబాటు చేసివారందరికి రాజకీయ జీవితం ఇచ్చిందే అమ్మ అని శశికళ గుర్తు చేశారు. అయితే పన్నీర్ సెల్వం పార్టీకి వెన్ను పోటుపొడిచి డీఎంకే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారని శశికళ ఆరోపించారు.
అందుకే తాను ముఖ్యమంత్రి కావాలని రంగంలోకి దిగానని, దానిని ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏమీ చెయ్యలేరని, తాను జయలలిత ఆశయాలను కాపాడుకోవడానికి కచ్చితంగా సీఎం అవుతానని అన్నారు.
ఇలాంటి పన్నీర్ సెల్వం లాంటి వ్యక్తులను తన జీవితంలో వెయ్యి మందిని చూసి ఉంటానని, ఇలాంటి తాటాకు బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తేలేదని శశికళ కుండలు బద్దలు కొట్టి చెప్పారు. పన్నీర్ సెల్వంకు కచ్చితంగా తామ ఎమ్మెల్యేలు బుద్దిచెబుతారని శశికళ నటరాజన్ ధీమా వ్యక్తం చేశారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ కోరామని, ఆయన ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నామని, కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం మాకుందని, శాసన సభ్యులు అందరూ తనకు మద్దతు ఇస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications