Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: క్యాష్‌బ్యాక్ ఆఫర్, కనీస రీ చార్జీ రూ.150

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అమల్లోకి తెచ్చిన ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి. వోడాఫోన్ మై్క్రోమ్యాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు పోటీగా నిలిచింది. అయితే ప్రత్యర్థి టెలికం కంపెనీలు కూడ తమ ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

జియో బాటలోనే ఇతర టెలికం కంపెనీలు నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్ ప్లాన్లను మార్చుకోవడంతో పాటు తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను కూడ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

వోడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

వోడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్

వోడాఫోన్ కూడ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపికచేసిన మైక్రోమ్యాక్స్‌ 4జీ స్మార్ట్‌ఫోన్లపై టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది.

మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 2 ప్లస్‌, మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 3, మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 4, మైక్రోమ్యాక్స్‌ కాన్వాస్‌ 1 స్మార్ట్‌ఫోన్లలో వోడాఫోన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.

మైక్రోమ్యాక్స్ ఫోన్ కొనుగోలు చేస్తేనే

మైక్రోమ్యాక్స్ ఫోన్ కొనుగోలు చేస్తేనే

వొడాఫోన్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొందాలంటే మైక్రోమ్యాక్స్ నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఏదో ఒక్క దాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తోందని వొడాఫోన్ ప్రకటించింది. వోడాఫోన్, మైక్రోమ్యాక్స్ రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది.

వొడాఫోన్ కనీస రీఛార్జీ రూ. 150

వొడాఫోన్ కనీస రీఛార్జీ రూ. 150

మైక్రోమ్యాక్స్‌కు చెందిన నాలుగు 4జీ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడంతో పాటు 36 నెలల పాటు నెలకు కనీసం రూ.150 వరకు వొడాఫోన్‌ రీఛార్జ్‌లు చేయించుకోవాలి.ఇలా చేసిన కస్టమర్లకు తొలి 18 నెలలు ముగియగానే, రూ.900 క్యాష్‌బ్యాక్‌, ఆ తర్వాత 18 నెలలు ముగియగానే రూ.1300 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అంటే మొత్తంగా రూ.2,200 వరకు క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు పొందనున్నారు.

వొడాఫోన్ ఎం పైసా వాలెట్

వొడాఫోన్ ఎం పైసా వాలెట్

చందాదారులు వొడాఫోన్‌ ఎం-పెసా వాలెట్‌లో ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని క్రెడిట్‌ చేయనున్నారు. గత నెలలో కూడా వొడాఫోన్‌, మైక్రోమ్యాక్స్‌లు భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. అప్పుడు మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ రూ.999కే అందుబాటులోకి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+