వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లా .. పెళ్ళామా.. ఇద్దరూ కాదు.. షెల్టర్ హోంకు పంపమన్న కోర్టు .. ట్విస్ట్ ఏంటంటే !!

|
Google Oneindia TeluguNews

అలహాబాద్ హైకోర్టులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది.తన కొడుకు తనకే కావాలని ఓ తల్లి, తన భర్త తన వద్దనే ఉండాలని ఓ భార్య కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ విచిత్రమైన కేసుకు సంబంధించి వాదనలు విన్న కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అటు తల్లి వద్ద కాకుండా, ఇటు భార్య వద్ద కాకుండా షెల్టర్ హోమ్ లో ఉండాలని తీర్పునివ్వడం షాకింగ్ గా అనిపించినా అందుకు కారణం లేకపోలేదు.

కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, సోదరుడు ... రీజన్ తెలిస్తే షాక్!!కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, సోదరుడు ... రీజన్ తెలిస్తే షాక్!!

మేజర్ యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్న మైనర్ యువకుడు .. కోర్టుకెక్కిన కేసు

మేజర్ యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్న మైనర్ యువకుడు .. కోర్టుకెక్కిన కేసు

అసలు ఈ కేసు విషయానికి వస్తే అలహాబాద్ ఆజం ఘడ్ కు చెందిన ఓ 16 ఏళ్ల యువకుడు, ఓ మేజర్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అంతేకాదు ఆ యువతితో సంసారం చేసి ఒక బాలుడికి తండ్రి కూడా అయ్యాడు. అయితే తన కొడుకు మైనర్ అని, అతనిని తన వద్దనే ఉండేలా కోర్టు తనకు న్యాయం చేయాలని తల్లి, అతను తనను ప్రేమించి పెళ్లాడిన భర్త అని, తన వద్దనే ఉండేలా చూడాలని భార్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

మైనర్ కాబట్టి తనతో పంపాలన్న తల్లి , పెళ్లి చేసుకున్నానన్న భార్య

మైనర్ కాబట్టి తనతో పంపాలన్న తల్లి , పెళ్లి చేసుకున్నానన్న భార్య

అయితే సదరు యువకుడు తనకు తల్లి వద్దని,భార్య కావాలని పట్టుబట్టి, తాను భార్యతోనే ఉంటానంటూ తేల్చిచెప్పాడు. ఈ మొత్తం వాదనలు విన్న ధర్మాసనం బాలుడు మైనర్ కాబట్టి మైనారిటీ తీరేవరకూ షెల్టర్ హోమ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకు అంటే మైనారిటీ తీరేవరకూ ఆ బాలుడు అక్కడే ఉండాలని పేర్కొంది. మైనర్ వివాహం చెల్లుబాటు కాదు కాబట్టి తల్లి వెంట వెళ్లాలని కోర్టు చెబితే బాలుడు నిరాకరించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

 ఇద్దరి వద్ద కాకుండా షెల్టర్ హోం కు పంపమని కోర్టు ఆదేశం

ఇద్దరి వద్ద కాకుండా షెల్టర్ హోం కు పంపమని కోర్టు ఆదేశం

ఇదే సమయంలో మేజర్ అయిన యువతితో పంపించేందుకు అంగీకరిస్తే అది పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది కాబట్టి కోర్టు అతనిని షెల్టర్ హోమ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనారిటీ తీరే వరకు అక్కడే ఉండాలని ఆ తర్వాత అతను ఎవరితో ఉండాలనుకుంటే వారితో ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ కేసులో గత నెల 31వ తేదీన తీర్పు వచ్చినప్పటికీ, న్యాయ తన వెబ్ సైట్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇంత కథ నడిపిన మైనర్ కు ఒక కొడుకు కూడా ఉండడం ఇందులో షాకింగ్ ట్విస్ట్.

English summary
A strange incident took place in the Allahabad High Court. Minor boy married a major girl and gave birth to a son also, the mother and wife went to the court to keep her son to herself and her husband to be with her. The court, however, gave a sensational verdict after hearing arguments of a minor boy case. The decision to stay in a shelter home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X