బిజెపిని అంటావా: నితీష్‌కు ములాయం మరో షాక్

పాట్నా: నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్ - సోనియా గాంధీకి ఇప్పటికే ఓ షాకిచ్చిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాడు మరో ఝలక్ ఇచ్చారు. ఎన్నికల్లో నితీష్, లాలూ ప్రసాద్‌లకు తప్ప ఎవరికైనా ఓటు వేయాలని ఆయన బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో.. ములాయం తొలిసారి నితీష్, లాలులకు ఝలక్ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో వారు ఓ కూటమిగా ఏర్పడ్డారు. ఆరు పార్టీలతో కలిసి కూటమి ఏర్పడింది. కానీ, ఎన్నికలకు ముందే.. వారికి ఝలక్ ఇస్తూ వామపక్షాలతో కలిసి తృతీయ ఫ్రంట్‌గా ములాయం పోటీ చేస్తున్నారు.

అది లాలూ - నితీష్‌లకు తొలి షాక్ కాగా.. తాజాగా, నితీష్ - లాలూ - కాంగ్రెస్ పార్టీల మహా కూటమికి తప్ప ఏ పార్టీకైనా ఓటేయమని పిలుపునివ్వడం రెండో షాక్.

అంతేకాదు, బీహార్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపికి వాతావరణం అనుకూలంగా ఉందని చెబుతూనే, రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నామన్నారు. బిజెపి చేసే మంచి పనులను తాను సమర్థిస్తానని చెప్పారు.

Vote for anyone except Nitish Kumar and Lalu Yadav, urges SP chief Mulayam Singh Yadav

లాలూ, నితీష్ ఇద్దరూ కూడా ఫ్రాడ్‌ల అని ధ్వజమెత్తారు. ఆ ఇద్దరు తనను చీట్ చేశారన్నారు. నితీష్ - లాలూ తన వద్దకు వచ్చి యాంటీ కాంగ్రెస్, యాంటీ బిజెపిగా.. మూడో ఫ్రంట్‌ను బలోపేతం చేయాలని కోరారని, తాను దానికి అంగీకరించానని, అయితే తనకు చెప్పకుండానే వారు ఆ తర్వాత కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీతో ప్రజలను ఇబ్బంది పెట్టిన పార్టీ అన్నారు. సోషలిస్టులను జైలుకు పంపించిందన్నారు. బిజెపిని విమర్శించే నైతిక హక్కు నితీష్ కుమార్‌కు లేదన్నారు. ఆయన పన్నెండేళ్ల పాటు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో ఉన్నారన్నారు. హఠాత్తుగా బీజేపీని తూలనాడటం ఏమిటన్నారు.

బీహార్‌లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని, అందుకే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని, అప్పుడు తామీ ప్రభుత్వం ఎన్నికకు కీలకం అవుతామని బీహార్ ప్రజలకు సూచించారు. బీహార్ అభివృద్ధిని కాంక్షించే పార్టీకి మేం మద్దతిస్తామని... పరోక్షంగా బిజెపిని ఉద్దేశించి అన్నారు.

మహా కూటమికి నేతృత్వం వహించాలని ములాయంను కోరినా ఆ తర్వాత లాలూ, నితీష్‌లు సోనియాకు వారు ప్రాధాన్యత ఇవ్వడం ములాయంకు రుచించలేదు. దానికి సీట్ల పంపకాలు కూడా తోడయ్యాయి. దీంతో ములాయం మహాకూటమికి దూరమయ్యారు. కేంద్రంలో కీలక బిల్లుల ఆమోదానికి ఎస్పీ ఎంపీలు కీలకం యూపీలో అభివృద్ధికి కేంద్రం మద్దతు తప్పనిసరి. దీంతో, బిజెపి - ఎస్పీ సన్నిహితమయ్యాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+