తెలుగు రాష్ట్రాలకు ఏమైంది?
Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపించింది. ఇంకొక్క రోజే బాకీ ఉంది. ఎల్లుండి.. అంటే ఈ నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే.
ఈ పరిస్థితుల మధ్య ఇండియా బ్లాక్ అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి.. ఎంపీల ముందుకు వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. సుదీర్ఘంగా ప్రసంగించారు సుదర్శన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తనను గెలిపించాల్సిన అవసరం ఏమిటో స్పష్టంగా వెల్లడించారు.

తన అభ్యర్థిత్వం వ్యక్తిగత ఆకాంక్ష కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించి, బలోపేతం చేయడానికి జరుగుతున్న సామూహిక ప్రయత్నమని అభివర్ణించారు. దశాబ్దాల పాటు ప్రజాసేవలో అనుభవం కలిగి ఉన్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, దాని పనితీరు పట్ల తనకు సమగ్ర అవగాహన ఉందని, ఔపోసన పట్టానని అన్నారు. ఈ అనుభవం తనకు పార్లమెంటరీ సంప్రదాయాలకు నిష్పక్షపాతంగా, రాజ్యంగా సంరక్షకుడిగా సేవ చేయడానికి సహాయపడుతుందని అన్నారు.
రాజ్యసభ ఛైర్మన్‌గా, ఉపరాష్ట్రపతి..సమతౌల్యం, వివేకం, తటస్థతను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని, ఈ సూత్రాలను తాను ఎల్లప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రతి గొంతుకూ గౌరవం ఇస్తూ పాటించానని సుదర్శన్ రెడ్డి అన్నారు. రాజ్యసభను నిజమైన హేతుబద్ధమైన చర్చ, నిర్మాణాత్మక సంభాషణకు వేదికగా మార్చడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పరస్పర సహకారంతోనే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందే తప్ప ఘర్షణతో కాదని తేల్చి చెప్పారాయన.
అనంతరం తెలుగు రాష్ట్రాల ఎంపీలను ఉద్దేశించి సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో ప్రసంగించారు. దేశం.. ప్రగతిపథం వైపు ప్రయాణించాలంటే పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, విలువలు, సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా ఆత్మప్రబోధానుసారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, పార్టీలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సుదర్శన్ రెడ్డి కోరారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది?, తెలంగాణ అస్థిత్వం ఏమైపోయిందని ప్రశ్నించారు. తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవి కోసం కాదని, రాజ్యాంగ పదవికి అని గుర్తు చేశారు. ఏన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తామని వైసీపీ చెప్పిందని, టీడీపీ, బీఆర్‌ఎస్ నుంచి స్పందన కనిపించట్లేదని వ్యాఖ్యానించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications