వ్యాపం స్కాం: హత్య కేసుగా నమ్రత దోమర్ మృతి
న్యూఢిల్లీ: భయానకమైన వ్యాపం కేసుకు సంబంధించి ఎంబిబిఎస్ విద్యార్థిని నమ్రత దోమర్ మృతిని సిబిఐ అధికారులు శుక్రవారంనాడు హత్య కేసుగా నమోదు చేశారు. హత్య కేసుగా పరిగణనలోకి తీసుకుని నమ్రత మృతిపై సిబిఐ దర్యాప్తు చేయనుంది.
వ్యాపం కుంభకోణం కేసులో నిందితురాలైన నమ్రత దోమర్ శవం 2012 జనవరిలో ఉజ్జయినిలోని రైల్వే ట్రాక్‌పై కనిపించింది. నమ్రత అక్రమంగా ఎంబిబిఎస్ సీటు పొందినట్లు అనుమానిస్తున్నారు. నమ్రతను ఎవరైనా నడుస్తున్న రైల్లోంచి తోసివేశారా, ఆమెనే స్వయంగా రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా అనే విషయంపై పోలీసుల దర్యాప్తు ఏమీ తేల్చలేకపోయింది.

నమ్రత ఊపిరాడక చనిపోయిందని ఆమె శవానికి పరీక్షలు చేసిన వైద్యుల బృందం తెలిపింది. దీంతో ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తాయి. వ్యాపం కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఇదివరకు ఐదు కేసులు నమోదు చేశారు. దీంతో సిబిఐ ఎనిమిది కేసులు నమోదు చేసినట్లయింది.
మధ్యప్రదేశ్‌లో బయటపడిన వ్యాపం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని భావిస్తున్నవాళ్లు ఒక్కరొక్కరే మరణిస్తుండడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ తన చేతుల్లోకి తీసుకుని దర్యాప్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications