• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎట్టకేలకు నోరు విప్పిన రియా చక్రవర్తి... సుశాంత్ తన కలలో వచ్చాడని మొదలుపెట్టి....

|

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అన్ని వైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియాచక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. సుశాంత్ మరణించిన జూన్ 14 నుంచి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయని రియా... మొట్టమొదటిసారిగా ఓపెన్ అప్ అయ్యారు. పలు జాతీయ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనసులో మాటలు పంచుకున్నారు. సుశాంత్‌తో తన అనుబంధం,తనపై వస్తున్న ఆరోపణలు తదితర అంశాలకు సమాధానం చెప్పారు.

  Sushant Singh Rajput : ఎట్టకేలకు నోరు విప్పిన రియా చక్రవర్తి.. సంచలన విషయాలు వెలుగులోకి! || Oneindia
  ఇప్పుడే ఎందుకు ఓపెన్ అయ్యారు...

  ఇప్పుడే ఎందుకు ఓపెన్ అయ్యారు...

  ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు... సుశాంత్ తన కలలోకి వచ్చి నిజాలు నిర్భయంగా మాట్లాడాలని చెప్పినట్లు రియా తెలిపారు. ఎక్కడ చూసినా పక్షపాత కథనాలే కనిపిస్తుండటంతో... ఇక తాను మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. 2013లో వైఆర్ఎఫ్ జిమ్‌లో మొదటిసారి తాము కలుసుకున్నామని చెప్పారు. 2015లో రోహిణి అయ్యర్ ఇచ్చిన ఓ పార్టీలో సుశాంత్ తనకు ప్రపోజ్ చేశాడని.. కేవలం ఒక్కరోజులోనే నాతో ప్రేమలో పడ్డట్టు చెప్పాడని అన్నారు. కానీ తనకు కొద్దిరోజులు టైమ్ కావాలని కోరినట్లు రియా చెప్పారు. సుశాంత్ చెప్పిన ఆ ఐలవ్యూ ఈరోజు తనను ఈ స్థితికి తీసుకొస్తుందని ఊహించలేదన్నారు.

  సుశాంత్ తండ్రి గురించి...

  సుశాంత్ తండ్రి గురించి...

  సుశాంత్‌కి తన తండ్రికి అంతగా అనుబంధం లేదన్నారు రియా. సుశాంత్ చిన్నతనంలోనే అతని తల్లిని తండ్రి వదిలిపెట్టారని చెప్పారు. సుశాంత్‌ను తాను కలిసే ముందువరకు ఐదేళ్ల పాటు అతనికి,అతని తండ్రికి మాటలు లేవన్నారు. తన తండ్రితో తనకు అంతగా సంబంధాలు లేవని సుశాంత్ కూడా తనతో చాలాసార్లు చెప్పాడన్నారు. సుశాంత్ తన తల్లిని అమితంగా ప్రేమించేవారని... చిన్నతనంలోనే తండ్రి ఆమెను వదిలిపెట్టడంతో అది అతనిపై ప్రభావం చూపించిందన్నారు. అతని కుటుంబం ఆరోపించినట్లుగా తానేమీ సుశాంత్‌ను వారి నుంచి దూరం చేయాలని చూడలేదన్నారు.

  జూన్ 8-జూన్ 14

  జూన్ 8-జూన్ 14

  అసలు జూన్ 8 నుంచి జూన్ 14 వరకు సుశాంత్ జీవితంలో అసలేం జరిగిందో తనకూ తెలుసుకోవాలని ఉందన్నారు. ఆ సమయంలో తాను అతనితో లేనని చెప్పారు. ఆ ఆరు రోజులు సుశాంత్‌తో ఎవరున్నారని అతని సోదరి మీతు సింగ్‌ని అడిగినట్లు చెప్పారు. సుశాంత్‌ది ఆత్మహత్య లేక మరేమైనా జరిగిందా అన్నది తనకూ తెలియదన్నారు. 'జూన్ 8 నుంచి జూన్ 14 వరకు నేను అతనితో లేను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా లేదు. అతనితో ఉన్నది అతని సోదరి మీతు సింగ్. కాబట్టి సుశాంత్‌ది ఆత్మహత్యా మరేమైనా జరిగిందా అన్నది ఆమె నుంచే తెలుసుకోవాలనుకుంటున్నా' అని రియా చెప్పుకొచ్చారు.

  డ్రగ్స్ లింకులపై...

  డ్రగ్స్ లింకులపై...

  తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్ డీలర్‌తో మాట్లాడటం కాదని,డ్రగ్స్ తీసుకోవడం గాని చేయలేదన్నారు. తాను బ్లడ్ టెస్టుకు రెడీగా ఉన్నానని చెప్పారు. తానేమి చెప్పినా వక్రీకర్తిస్తారని అన్నారు. సుశాంత్ నుంచి తానెప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. ఈడీ కూడా తనను విచారించిందని... సుశాంత్ బ్యాంకు ఖాతాలు పబ్లిక్ డొమైన్‌లోనే ఉన్నాయని చెప్పారు. సమ భాగస్వామ్యంతో తామిద్దరం ఓ కంపెనీ నెలకొల్పినట్లు వెల్లడించారు.

  English summary
  When Rhea Chakraborty was asked what she thought, whether Sushant Singh Rajput died by suicide or it was a foul play, she said, "Even I want to know. Between [June] 8 to 14, I had no communication with him. I was not there. His sister Meetu was there. I want to know from her what happened between June 8 to 14, if it was a suicide or something else."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X