Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాంటెడ్ ... రైతులు కావలెను .. 20 వేల ఆకర్షణీయమైన జీతం,భోజనవసతి

వాంటెడ్ ఫార్మర్స్... అవును రైతులు కావలెను... ఏదో సరదాకి చెప్తున్న విషయం కాదు. సీరియస్ గానే దేశానికి అన్నం పెట్టే రైతన్న కావలెను. ఏదో ఊరికే అడగడం లేదు. 20 వేల రూపాయల ఆకర్షణీయమైన జీతం ఇస్తాము. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్న వారు అందులోనూ ప్రకృతి వ్యవసాయం మీద పట్టుకున్న వారికి మొదటి ప్రాధాన్యత కూడా ఉంటుంది.ఇదంతా ఏంటి అనుకుంటున్నారా. నిజంగానే ఇది ఒక వాంటెడ్ కాలమ్.

అన్నదాతల కొరత .. అందుకే రైతులు కావలెను అని ఉద్యోగ ప్రకటన

అన్నదాతల కొరత .. అందుకే రైతులు కావలెను అని ఉద్యోగ ప్రకటన

దేశవ్యాప్తంగా అందరూ తినే వాళ్ళు అయితే, ఆహార ఉత్పత్తి చేసే వాళ్ళు ఎవరు.. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తే దేశానికి అన్నం పెట్టేది ఎవరు. అందుకే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావాలి అంటూ తమిళనాడుకు చెందిన ఓ సంస్థ రైతన్నలకు ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించింది.

దేశానికి వెన్నెముక రైతన్న.అటువంటి రైతన్నలు ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాత ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే బతకడం కష్టమంటూ చాలా రాష్ట్రాల్లో అన్నదాతలు వలస పోయి కూలీనాలీ పని చేసుకుంటున్నారు. దీంతో తమ పిల్లల్ని సైతం ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు కానీ వ్యవసాయం చేయడానికి ఏ ఒక్కరు ప్రోత్సాహం అందించడం లేదు. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. భవిష్యత్తులో రైతు వ్యవస్థ దెబ్బతిననుంది.

సేంద్రీయ వ్యవసాయానికి రైతులు లేక ఇబ్బంది పడుతున్న ఓ సంస్థ

సేంద్రీయ వ్యవసాయానికి రైతులు లేక ఇబ్బంది పడుతున్న ఓ సంస్థ

ఇక కొందరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ సృజనాత్మకతను జోడించి కొత్త సాగు విధానాలు కనిపెట్టి అధిక దిగుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా తమిళనాడులోని కోయంబత్తూరు కు చెందిన కీరైకడై అనే సంస్థ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తుంది. ఇక్కడ సంస్థ సేంద్రియ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులతో ఈ సంస్థ కొనసాగుతుంది. సేంద్రియ పంటల సాగు చేస్తున్న ఈ సంస్థ రైతన్నల కొరతతో ఇబ్బంది పడుతుంది. తమ వ్యవసాయ క్షేత్రంలో తగినంత మంది రైతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ సంస్థ మంచి జీతం , భోజనం , వసతి కూడా కల్పిస్తామని రైతులు కావాలని అడుగుతుంది.

రైతులు కావాలని ప్రకటన ..జీతంతో పాటు భోజనవసతి కూడా

రైతులు కావాలని ప్రకటన ..జీతంతో పాటు భోజనవసతి కూడా

అందుకే వాంటెడ్ ఫార్మర్స్ అంటూ ఏకంగా రైతన్నలు కావలెను అని ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. నెలకు 15 వేల నుంచి 20 వేల వరకు జీతం ఇస్తామని, ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సహజసిద్ధ ఆహారాన్ని సమాజానికి అందించే రైతుల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రకృతి వ్యవసాయం చేయగలిగినవారికి మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. ఈ ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది మన దేశానికి రైతన్నలు కావలెను అని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+