కాంగ్రెస్‌పై అసంతృప్తి!: ఆ ఇద్దరి భేటీ ముందే తెలుసు.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: బీజేపీకి మద్దతు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తనతో ప్రస్తావించారంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ సొంతగూటిక చేరిన అజిత్ పవార్ విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ ముందే తెలుసు..
మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ మంతనాలు జరుపుతున్నట్లు తనకు ముందే తెలుసని శరద్ పవార్ తెలిపారు. అయితే, ఆయన మంతనాలు ప్రమాణస్వీకారం వరకు వెళతాయని తాను అనుకోలేదని అన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తే..
అంతేగాక, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, శివసేనతోపాటు బీజేపీతోనూ ఎన్సీపీ చర్చలు జరిపిందని శరద్ పవార్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి ముందు నవంబర్ 22న ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్‌సీసీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు వెల్లడించారు.. కాంగ్రెస్ నాయకుల తీరుపై అజిత్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. పరోక్షంగా అజిత్ తిరుగుబాటుకు ఇదే కారణమై ఉండొచ్చని అన్నారు.

నాతోపాటు అజిత్ బయటికొచ్చేశారు..
ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయని.. కాంగ్రెస్ మరికొన్ని పోర్ట్‌ఫోలియోలు కావాలంటూ డిమాండ్ చేసిందని.. దీంతో తాను ఆ సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. తనతోపాటు అజిత్ పవార్ కూడా బయటికి వచ్చేశారని శరద్ పవార్ తెలిపారు. రానున్న రోజుల్లో వారితో ఎన్సీపీ ఎలా పనిచేయాలో అని అజిత్ తన అభిప్రాయాన్ని పార్టీ నాయకుల మధ్య ఉంచారని, అదేరోజు రాత్రి ఫడ్నవీస్, అజిత్ భేటీ జరిగిందని ఈ సీనియర్ నేత వివరించారు.

నా హస్తం లేదు..
అజిత్ ప్రమాణస్వీకారం వెనుక తన హస్తం ఉందంటూ జరిగిన ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ టచ్‌లో ఉన్నట్లు మాత్రమే తనకు తెలుసని.. అయితే ప్రమాణస్వీకారం వరకు వెళుతుందని భావించలేదని తెలిపారు. నవంబర్ 23న ఉదయం అజిత్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపారు సీనియర్ పవార్. తాను బీజేపీతో కలవడానికి ఎప్పుడూ అంగీకరించలేదన్నారు.

అజిత్‌కు డిప్యూటీ సీఎంపై ఇలా..
ప్రస్తుత మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి లభిస్తుందన్న ఊహాగానాలపైనా సీనియర్ పవార్ స్పందించారు. అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టే విషయంలో ఎవరికీ వ్యతిరేకత లేదని అన్నారు. బీజేపీ కలిసినందుకు పార్టీలో అజిత్‌పై కొంత అసంతృప్తి కలిగినా.. తిరిగి రావడంతో మళ్లీ ఆయనకు మద్దతు పెరిగిందని శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలేకు కేంద్రమంత్రి పదవి, తనకు రాష్ట్రపతి పదవి ఇస్తారని మోడీతో భేటీ తర్వాత జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మోడీ ఎప్పుడూ అలాంటి ప్రతిపాదన తేలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications