వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 ఏళ్ల బాలిక ఎఫైర్.. మైనర్ రేప్ చేశాడు..? ప్రెగ్నెంట్ కూడా కావొచ్చు..?: దీదీ

|
Google Oneindia TeluguNews

బెంగాల్‌లో 14 ఏళ్ల మైనర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేత ఒకరు బర్త్ డేకు పిలిచి.. రేప్ చేసి హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పందించారు. నడియా జిల్లాలో ఈ నెల 5వ తేదీన బాలికపై లైంగికదాడి జరిగింది. తర్వాత చంపివేశారు. ఘటనపై దీదీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె నిజంగా రేప్ చేయడంతో చనిపోయిందా అని అడిగారు. ఆమె గర్భవతా..? లేదంటే ఆమెకు ఎఫైర్ ఉందా అని అడిగారు. మీరు ఎంక్వైరీ చేశారా..? అంటూ ఫైరయ్యారు.

ఘటనపై తాను పోలీసులను అడిగానని మమతా చెప్పారు. ఇప్పటికే వారు అరెస్ట్ చేశారని తెలిపారు. బాలికకు యువకుడితో సంబంధం ఉందని విన్నానని చెప్పారు. బర్త్ డే పార్టీకి వెళ్లే సమయంలో మైనర్ రేప్ చేశాడని పేర్కొంది. 5వ తేదీన చనిపోయిన సంగతి తెలిసిందే. చిన్నారి మృతదేహానికి పంచనామా చేయకుండా దహనం చేశామని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. టీఎంసీ పంచాయతీ లీడర్ ఒత్తిడి మేరకు పనిచేశారని అన్నారు. ఈ కేసులో బ్రజ్ గోపాల్ గొలా మొదటి నిందితుడు అని వారు అంటున్నారు.

was she pregnant after affair? Mamata Banerjee over 14-year-old murder

ఘటన జరిగిన 5 రోజులకు పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారు. 5వ తేదీన ఎందుకు ఫిర్యాదు చేయలేదని మమతా బెనర్జీ అడిగారు. ఘటన జరిగిన రోజే ఎందుకు పీఎస్‌కు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పటికే మృతదేహం దహనం చేయడంతో.. పోలీసులకు సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందని అడిగారు. ఇదీ కచ్చితంగా ప్రేమ సంబంధించిన విషయమేనని తెలిపారు. అదీ వారి కుటుంబానికి కూడా తెలుసు అని చెప్పారు. వారి మధ్య సంబంధం ఉంటే మనం ఆపగలమా అని అడిగారు. ఇదీ ఉత్తరప్రదేశ్ కాదు.. ఇక్కడ లవ్ జిహదీలు ఉండవు అని చెప్పారు. ఇక్కడ అందరికీ స్వేచ్చ ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఏమైనా తప్పిదం జరిగితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు.

పనిలో పనిగా బీజేపీప విమర్శలు చేశారు. బీజేపీ ఉదయం హెడ్ లైన్ నిర్ణయించగా.. మీడియా దానిని అనుసరిస్తోందని తెలిపారు. పెట్రోల్ ధరల పెంపు గురించి ఎన్నిసార్లు మాట్లాడారు.. ఢిల్లీ అల్లర్ల గురించి.. ఎన్ఆర్సీ గురించి ఎన్ని పర్యాయాలు డిస్కస్ చేశారని అడిగారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee has raised questions over the reports of a 14-year-old girl who was allegedly raped in Nadia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X