
Viral video:వావ్.. క్రూ సిబ్బంది చొరవ, చిన్నారిని ఎత్తుకొని.. వైరల్
కొందరు విమాన ప్రయాణం అంటే భయపడతారు. ట్రావెల్ చేసే సమయంలో భయంగానే ఉంటారు. అయితే వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు.. పిల్లలు ఏడిస్తే.. వారిని శాంతింపజేయడం కష్టమే.. ఆ సమయంలో విమాన సిబ్బంది చొరవ తీసుకున్నారు. ఆ వీడియో పాతదే అయినప్పటికీ మళ్లీ వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో ఈ నెల 7వ తేదీన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జీవన్ వెంకటేశ్ అనే యూజర్ పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు చిన్నారిని తీసుకున్నారు. అందరూ సీట్లో కూర్చొండగా.. ఆమె ఎత్తుకుని, అటు ఇటు తిరుగుతూ ఆడించారు. సిబ్బంది పేరు స్టీవార్డ్.. అలా చిన్నారిని తీసుకోవడం పట్ల అంతా విష్ చేస్తున్నారు.

వీడియోను అంతా ట్యాగ్ చేశారు. చిన్నారిని మోస్తూ.. నడిచారు. చిన్నారిని చక్కగా ఓదార్చారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేశారు. అతనికి వందనం అంటూ రాశారు. వావ్ గ్రేట్ మ్యాన్.. గ్రేట్ హార్ట్ అని రాశారు. గర్వంగా ఉందని మరొకరు రాశారు. మా మనస్సులను హత్తుకునే ఘటన అని మరొకరు రాశారు. వీడియోను ఇప్పటికే లక్ష 70 వేల మంది లైక్ చేశారు. మిలియన్ల చాలా సార్లు చూశారు.