Viral Video:నడిరోడ్డుపై వృద్దురాలి ఇబ్బంది, రోడ్డు దాటేందుకు ట్రబుల్, చివరికీ ఇలా
మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ భారీగా ఉంటుంది. యంగ్ ఏజ్ వారు అయితే ఓకే.. వృద్దులకు కష్టాలు మాములుగా ఉంవు. ఈ కాంక్రీట్ జంగిల్‌లో పక్కవారిని పట్టించుకునే నాథుడు లేదు. అవును అలా ఓ వృద్దురాలు ఇబ్బంది పడగా.. ఎవరూ పట్టించుకోలేదు. చివరికీ ఫైరింజన్ దిగి.. సిబ్బందే రోడ్డు దాటించారు. అందుకోసమే ట్రాఫిక్ నియంత్రించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిజీ రోడ్డులో ముసలావిడ..
వాస్తవానికి ఇదీ పాత వీడియో.. కానీ ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. బిజీ రోడ్డులో ఆ ముసలావిడ ఉంది. రోడ్డు దాటేందుకు ట్రై చేసింది. కానీ వాహనాలు భారీగా రావడంతో కుదరలేదు. ఆ సమయంలో కార్లు, ఇతర వాహనాలు ఆపకుండా వెళుతున్నాయి. ఆ సమయంలో అటుగా ఫైరింజన్ వెళుతుంది. ఇంకేముంది మధ్యలో వాహనం పెట్టి.. ఒకరు దిగారు. ఆమెను చేత పట్టుకుని మరీ రోడ్డు దాటించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ ట్రోల్ అవుతుంది.

వెహికిల్ ఆపితే సరి
వీడియోను చాలా మంది లైక్ చేస్తున్నారు. తెగ కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండండి.. వాహనం ఆపాలని కోరారు. అలా చేస్తే వెనకాల వచ్చే వెహికిల్ కూడా ఆగుతుందని చెప్పారు. దీంతో అందరికీ అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఇలా ఒకరు చేయడం వల్ల మరొకరు కూడా చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించారు. ఫైరింజన్ సిబ్బంది చేసిన పనిని ప్రశంసించారు. వారి హృదయం చాలా మంచిదని చెబుతున్నారు. వారు రియల్ హీరోస్ అని కామెంట్ చేశారు.

ఎవరూ ఆపలేదు, దిగలేదు
నిజమే.. ఆ ఫైరింజన్ సిబ్బంది చొరవ తీసుకునే వరకు ఎవరూ స్పందించలేదు. కారు దిగి హెల్ప్ చేయకపోయినా ఫరవాలేదు.. కనీసం కారును ఆపలేదు. ఆమె ఇబ్బంది పడి వారు చూశారు. లేదంటే పరిస్థితి ఏంటీ అని మరొకరు అడుగుతున్నారు. ఆమె రోడ్డుపై ఎంతసేపు అలా ఉండాలని ప్రశ్నించారు. ఇకనైనా మిగతావారిలో మార్పు రావాలని అంటున్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడటం సరికాదని సజెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications