VIDEO:నీ కాండకావరం తగలెయ్య, కారుకు ఒరిగితే ఏం పోయిందారా అయ్యా.. వైరల్
కేరళను దైవ భూమి అంటారు. అక్కడ జరిగిన ఓ ఘటన ఆ పేరుకు మచ్చ తీసుకొస్తోంది. అవును.. ఓ కుర్రాడు కారుకు అనుకుని ఉంటే.. తన సొమ్ము ఏదో పోయినట్టు భావించాడు కారు ఓనర్. తన బలుపును ప్రదర్శించాడు. అయితే దానిని ఒకరు వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. కారు ఓనర్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంత అహంకారం అంటూ అంత మండిపడుతున్నారు.
రోడ్డు పక్కన ఒకతను కారు ఆపాడు. అతను పొన్యం పాలం అని.. హిస్సాద్‌గా తర్వాత గుర్తించారు. కారు పక్కకు ఓ ఆరేళ్ల బాలుడు వచ్చాడు. అతను కారుకు ఒరిగి ఉన్నాడు. దీంతో అప్పటికే కారులో ఉన్న అతనికి కోపం నశళానికి ఎక్కింది. కారు దిగేశాడు. ఇంకేముంది.. ఆ పిల్లాడిని తన్నేశాడు. దీంతో చిన్నోడు భయపడిపోయాడు. ఏం జరిగిందో ఆ పిల్లాడికి తెలియలేదు.
God's Own County has become the Devil's Own Land under the @pinarayivijayan regime. A six-year-old Rajasthani boy was kicked and manhandled for leaning on a car. This inhuman incident happend in Thalassery, Kannur.@PrakashJavdekar @AgrawalRMD @BJP4India pic.twitter.com/R0m9nd1sFQ
— K Surendran (@surendranbjp) November 4, 2022
ఇన్సిడెంట్‌ను కేరళలో ప్రతిపక్షం బీజేపీ ఖండించింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. కేరళ ప్రభుత్వం స్పందించింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నిందితుడిని పొన్యంపాలానికి చెందిన షిహ్సద్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ బాలుడి రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వారీగా గుర్తించారు.

పొట్టకూటీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం సహజం. కేరళకు చెందిన టీచర్లు కూడా తెలంగాణలో ఉండి ఉపాధి పొందుతున్నారు. మరీ పని మీద వచ్చిన ఆ పిల్లాడి పట్ల సదరు వ్యక్తి ప్రవర్తన సరికాదు. దీనిని యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది. అన్నీ వైపులా నుంచి ఒత్తిడి రావడంతో పినరయి విజయన్ సర్కార్ తలొగ్గి.. చర్యలకు ఉపక్రమించింది.












Click it and Unblock the Notifications