viral video:వార్ని.. షార్క్‌తో ఆటలా..? చివరికీ తప్పని కాటు, చేతి నుంచి రక్తం, వైరల్
కృర మృగాలు, పెద్ద జంతుజాలంతో ఆటలు ఆడొద్దు. అయినా కొందరు తీరు మారదు. ఏదో సరదగా ఆడతారు. ఇంకేముంది గాయపడతారు. ఇక్కడ ఓ వీడియోలో కూడా అంతే.. షార్క్‌తో చెలగాటం ఆడాడు. ఇంకేముంది అదీ ఒక్కసారి కరిచింది.. ఇంకేముంది చేతి నుంచి ఒక్కసారిగా రక్తం వచ్చింది. మరీ ఆ వీడియోను మీరు కూడా చూడండి.

షార్క్‌ను వదిలి..
రెడిట్‌లో 11 సెకన్ల నిడివి గల వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఒకతను సముద్రంలో షార్క్‌ను విడిచి పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అతను ఒక్కసారి వదిలేయక.. గెలికాడు. ఇంకేముంది దానికి కోపం వచ్చినట్టు ఉంది. ఒక్కసారి చేయిని కరిచింది. దీంతో వామ్మో అనడం అతని వంతయిపోయింది. ఆ వీడియోలో అతనితోపాటు మహిళ.. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

ఏమీ కానట్టు ఉండి..
అలా షార్క్ కరిచిన అతను మెల్లిగా నడుచుకుంటు వెళ్లాడు. షార్క్ కరిచిన అతను మాత్రం గిమ్మనకుండా ఉన్నాడు. అతను చాలా క్యాజువల్‌గా ఉన్నాడని అంతా కామెంట్ చేశారు. వీడియో చూసి తాను చాలాసార్లు నవ్వానని ఒకరు రాశారు. వీడియోకు ఇప్పటికే 33 వేల సార్లు చూడగా.. 3 వేల మంది కామెంట్ చేశారు. చాలా మంది ఫన్నీగా రాస్తున్నారు.
ఇంతకుముందు కూడా..
షార్క్ పళ్లు పదునుగా ఉంటాయి. వాటితో ఆటలు ఆడొద్దు. లేదంటే అంతే సంగతులు.. చేయి కాబట్టి ఓకే.. అదే తోడ.. ఇతర ప్రాంతంలో అయితే కాటు పెద్దగానే ఉండే ఛాన్స్ ఉంది. జనాలను షార్క్ చాలా సార్లు కాటు వేశాయని నేషనల్ జియోగ్రాఫిక్ అంచనా వేసింది. రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్లోరిడాలో గల జెన్సన్ బీచ్‌లో ఈత కొడుతున్న వ్యక్తిని చేయి పట్టుకుని షార్క్ లాక్కెళ్లినట్టు కనిపించింది.












Click it and Unblock the Notifications