viral video: కదిలించిన వీడియో,, పిల్ల ఏనుగు కదలకపోవడంతో తల్లడిల్లిన తల్లి.. వైరల్
మనకు ఏదైనా ఆపాయం జరిగినా.. అచేతన స్థితిలో ఉన్న పక్కవారు సాయం చేస్తారు. మనతో ఉన్న వారు వెంటనే రియాక్ట్ కావడంతో.. ఎవరు అందుబాటులో ఉంటే.. వారు ఆస్పత్రికి తీసుకెళతారు. మరీ అదీ మూగజీవాలకు సమస్య వస్తే.. అవీ ఎవరికీ చెప్పుకుంటాయి. తమ గోడును ఎలా వెల్లబోసుకుంటాయి. ఓ ఏనుగు.. తన పిల్ల ఏనుగు పడుకునే ఉంది. దీంతో ఆ తల్లి ఏనుగు తల్లడిల్లింది. ఏం చేసిందో మీరే చూడండి.

అచేతనంగా పిల్ల ఏనుగు
జూ లో పిల్ల ఏనుగు మంచి నిద్రలో ఉంది. తల్లి ఏనుగు లేపేందుకు ప్రయత్నించింది. అయినా నో యూజ్.. ఏం చేయాలో తోచలేదు. వెంటనే జూ కీపర్‌ను పిలిచింది. అతడు మెల్లగా వచ్చాడు. తన పిల్ల గురించి సైగ చేసింది. అతడు దానిని పట్టుకొని లేపాడు. కాసేపటికి అదీ కదిలింది. దీంతో తల్లి ఏనుగు ఆనందానికి అవధి లేకుండా పోయింది. ప్రాణాలు ఒక్కసారిగా లేచి వచ్చినట్టుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

12.4 మిలియన్ల వ్యూస్
ఇప్పటికే 12.4 మిలియన్ల సార్లు చూశారు. 4.31 లక్షల మంది లైకులు కొట్టారు. వేల కొలాది కామెంట్స్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ తన మాదిరిగానే జరిగిందని ఒకరు.. తల్లి ప్రేమ అలాంటిది మరొకరు కామెంట్ చేశారు. ప్రతీ పేరంట్ ఇలాగే వ్యవహరిస్తారని రాశారు. ప్రపంచంలో ఏ తల్లి, తండ్రి.. తమ బిడ్డ బాగోలేకుంటే అల్లాడిపోతారు. పడుకునే పడుకోరని మరొకరు రాశారు. పడుకున్న ఏనుగు చూసి తనకు అసూయ కలుగుతుందని మరొకరు రాశారు.
టచ్ చేసింది
నిజానికి వీడియో చూడగానే మనసుకు హత్తుకుంటుంది. అవును మూగజీవి అయిన ఏనుగు కూడా తల్లడిల్లిపోయింది. తన బిడ్డకు ఏమైందా అని కంగారు పడింది. జూ కీపర్లు ఇద్దరు వచ్చారు. ఒకరు దానిని లేపగా.. కదిలింది. అప్పుడు గానీ దాని మనసు ప్రశాంతంగా ఉండలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. నిజమే.. ఓ తల్లి ప్రేమ అలానే ఉంటుంది. అదీ మనుషులు అయినా.. మూగ జీవులు అయినా సరే.. దీంతో రుజువు అయ్యింది.












Click it and Unblock the Notifications