Viral video:మందేసి, చిందేసిన ప్రొఫెసర్, క్లాస్ రూమ్‌లో రచ్చ, వైరల్
ప్రొఫెసర్ హుందాగా ఉండాలి. స్టూడెంట్స్‌కు స్ఫూర్తిగా నిలవాలి. అయితే కొందరు అలా ఉండటం లేదు. అలాంటి వారే వార్తల్లో నిలుస్తున్నారు. పంజాబ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ తప్ప తాగి క్లాస్ రూమ్‌లో నానా రచ్చ చేశారు. మందు బాటిల్ పట్టుకొని మరీ.. హంగామా చేశారు. పాటలు పాడటమే కాదు.. డ్యాన్స్ కూడా చేశాడు. ఆ వీడియోలో స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తోన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అరుపులు, నవ్వులు కూడా చెవిన పడ్డాయి. మరీ మీరు కుడా ఓ సారి వినండి.
ప్రొఫెషన్ ప్రొఫెసరే.. కానీ
వీడియోలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు రవీంద్ర కుమార్.. ప్రొఫెషన్ ప్రొఫెసర్. అతను పఠాన్ కోట్‌లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. ఓ రోజు తరగతి గదికి మద్యం తాగేసి వచ్చాడు. విద్యార్థుల ముందు పాటలు పాడాడు. ఆయనను చూస్తే తాగినట్టే అనిపిస్తోంది. పంజాబీ పాటలు హమ్ చేశాడు. తర్వాత ఆగకపోవడంతో అతను డ్యాన్స్ కూడా చేశాడు. ఆ వీడియోలో ప్రొఫెసర్ జోష్ మనం చూడొచ్చు.
సోయి మరచి..
విద్యార్థులకు మ్యాథ్స్ చెప్పే రవీంద్ర కుమార్.. ఆ రోజు సోయి మరచాడు. తరగతి దిలో నానా రచ్చ చేశాడు. ఆ వీడియోను రజనీ సింగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్లాస్ రూమ్‌లో ప్రొఫెసర్ రచ్చ అని రాశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. చాలా మంది యూజర్లు అతడి తీరును తప్పుపడుతున్నారు. ప్రొఫెసర్ ఇలా చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ విద్యార్థులకు అంత మంచిది కాదని.. దీనిని సుమోటోగా తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులు కూడా ఆ ప్రొఫెసర్ మాదిరిగా బిహేవ్ చేయడం సరికాదు.. తరగతి గదిలో వారు కూడా ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో అప్పుడు విలువలు లేవని మరొకరు కామెంట్ చేశారు.
కొలువు పాయే
ఆ వీడియో ట్రోల్ కావడంతో సదరు కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. రవీంద్ర కుమార్ పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ అని తెలిసింది. అతని విధుల నుంచి తప్పించామని కాలేజీ ప్రిన్సిపాల్ భూపిందర్ కౌర్ తెలిపారని ప్రీ ప్రెస్ జర్నల్ రాసింది. కానీ కుమార్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఇతరుల మాదిరిగా ప్రవర్తించానని.. దీంతో విద్యార్థులకు ఈజీగా పాఠం అర్థం అవుతుందని తెలిపారు. ఇలా బోధించడం వల్ల తరగతి గదిలో మంచి వాతావరణం ఉంటుందని, సులభంగా అర్థం అవుతుందన్నారు. కానీ వీడియోలో మాత్రం ఆయన తాగినట్టే ఉన్నారు. ఉన్న ఉద్యోగం కాస్తా ఊడింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications