చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

viral video:నెటిజన్ల హృదయం గెలిచిన జొమాటో డెలివరీ బాయ్, కారణమిదే, వైరల్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అదే ఫుడ్, ఫ్రూట్స్.. చివరికీ పాలు, కూరగాయాలు కూడా డెలివరీ చేస్తున్నారు. ఛార్జెస్ తీసుకొని డెలివరీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే డెలివరీ అంటేనే ఉరుకులు, పరుగుల జీవితం.. కస్టమర్‌కు సమయానికి ఫుడ్ అందించాలి.. లేదంటే కస్టమర్ సరయిన రేటింగ్ ఇవ్వరు. మరీ డెలివరీ బాయ్ దివ్యాంగుడు అయితే.. వినడానికే కాస్త వింతగా ఉన్నా.. ఇదీ నిజం. గణేశ్ మురుగన్ అనే దివ్యాంగుడు డెలివరీ చేస్తూ... నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు.

గణేశ్ దీనగాథ ఇదీ

గణేశ్ దీనగాథ ఇదీ


గణేశ్‌కు సంబంధించిన వీడియోను ఒకరు గ్రూమింగ్ బుల్స్ పేరుతో షేర్ చేశారు. దానికి 'బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్పిరేషన్' అని రాశారు. ఈతను స్పెషల్ బైక్ మీద.. చెన్నై వీధుల్లో డెలివరీ చేస్తుంటారు. వీడియోను నెటిజన్లు వీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 762 కే చాలాసార్లు చూశారు. 109 కే లైకులు కొట్టారు. అంతకుముందు గణేశ్ దీనగాథను ఐపీఎస్ అధికారు దీపాంశు కబ్రా ట్వీట్ చేశారు.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


గణేశ్‌కు ఆరేళ్ల క్రితం ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీ కొనడంతో వెన్నెముకకు గాయమైంది. కొద్దీరోజులు పక్షపాతం సమస్యను కూడా ఎదుర్కొన్నారు. తర్వాత అతని జీవితంలో మార్పు వచ్చింది. ఎన్నాళ్లు ఇలా ఉండాలని అనుకొని.. తనకు తాను సొంత కాళ్లపై నిలబడ్డాడు. అతనికి ఐఐటీ మద్రాస్ వీల్ ఛైర్ మాదిరిగా బైక్ తయారు చేశారు. ఇదీ బైక్.. అలానే వీల్ ఛైర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా బటన్ కూడా ఏర్పాటు చేశారు. ఇదీ రావడంతో.. ఆయన జీవితంలో పెద్ద మార్పు జరిగింది. డెలివరీ చేయాలని జొమాటోలో చేరాడు. కంపెనీ కూడా ఆయనకు అవకాశం కల్పించింది.

జొమాటోకు సెల్యూట్


అతనికి అవకాశం కల్పించిన జొమాటోకు ఇన్ స్ట కూడా థాంక్స్ చెప్పింది. గణేశ్‌కు అవకాశం కల్పించిన జొమాటోకు సెల్యూట్ చేస్తున్నానని ఒకరు రాశారు. తనను కన్నీళ్లు ఆగడం లేదని మరొకరు రాశారు. ఇలా చాలామంది కామెంట్స్ చేశారు. వావ్ అంటూ.. జొమాటోను కొనియాడారు. గణేశ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కూడా రాశారు. నిజమే గణేశ్.. చూడటానికి అవిటివాడు.. కానీ అతను మిగతావారిలాగే పనిచేస్తూ.. అందరి చేత ప్రశంసలను పొందుతున్నాడు.

English summary
37-year-old Ganesh Murugan from Chennai could be seen riding his 'special' bike and working to earn living despite his shortcomings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X