Viral video:టాయ్‌లెట్‌లో భోజనం, ప్లేయర్స్ అంటే ఇంత చిన్నచూపా..? వైరల్

సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా ఉన్న కొందరీ తీరు మారడం లేదు.రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. తెలిసి మరీ తప్పులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మహిళా కబడ్డీ ప్రేయర్స్ పట్ల దారుణంగా ప్రవర్తించారు. వారికి ఏకంగా టాయిలెట్‌లో భోజనం పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దిగొచ్చిన సర్కార్..

దిగొచ్చిన సర్కార్..

ఈ ఘటన యూపీలో గల సహరంగ్ పూర్ జిల్లాలో జరిగింది. సరదు వీడియో బయటకు రావడం.. దుమారం చెలరేగడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దిగొచ్చింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 16వ తేదీన ఘటన జరిగగా.. ఆ వీడియోలో మహిళలు ఆహారం తీసుకుంటున్నారు. అన్నం, కూర తీసుకుంటుండగా.. అదీ టాయిలెట్ అని స్పష్టంగా కనిపిస్తోంది. టాయిలెట్ వద్ద ప్లేటు, ఇతర సామాగ్రి కూడా కనిపించాయి.

ఇదేం పద్ధతి..

వీడియో పోస్ట్ చేయగా.. చాలా మంది దుమ్మెత్తి పోశారు. నేతలు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నేతలతోపాటు ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్ షేర్ చేశారు. టీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి కూడా షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్ మహిళ బిడ్డలకు టాయిలెట్‌లో ఆహారం పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంచి పనుల కోసం బీజేపీ సర్కార్ డబ్బులు వెచ్చించలేదా అని అడిగారు. ఇదీ మంచి పద్దతి కాదని దుమ్మెత్తిపోశారు.

తప్పు తప్పే కదా..?

తప్పు తప్పే కదా..?

కిందిస్థాయి సిబ్బంది/ అధికారులు చేసిన పని ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి సీఎస్ ఆగ్రహాం వ్యక్తం చేశారని స్పోర్ట్స్ అధికారి ఒకరు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. బాధ్యులను సస్పెండ్ చేశామని.. విచారణ జరిపి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇదేంటి మహిళ ప్లేయర్ల పట్ల ఇలా ప్రవర్తిస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+