viral video:మామపై స్లిప్పర్‌తో దాడి, తండ్రి, సోదరుడు హెల్ప్, ఎక్కడ, ఎందుకంటే..?
ఆస్తి కోసం పేగు బంధం కూడా చూడటం లేదు. కొన్నిసార్లు పేరంట్స్‌ను కూడా పట్టించుకోవడం లేదు. రోజుకో చోట ఇలాంటి ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ ఘజిపూర్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అవును.. కోడలు, తన మామపై దాడికి దిగింది. ఆమెకు తండ్రి, సోదరుడు సహకరించారు. ఘటన చౌకీ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

రోడ్డుపై దాడి
మామను రోడ్డుపైకి తీసుకొచ్చి మరీ.. దాడి చేశారు. కోడలు చెప్పుతో మరీ కొట్టింది. ముగ్గురు కలిసి వృద్దుడిపై తమ ప్రతాపం చూపించారు. కొట్టారు.. తన్నారు. రోడ్డుపై నానా హంగామా చేశారు. వీడియో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగారు. మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. వృద్దుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహిళా, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ నేపథ్యం..
వృద్దుడు సుఖ్ దేవ్ సింగ్.. అతని కుమారుడు బబ్లూ యాదవ్, మరొ కుమారుడు చనిపోయాడు. అతని భార్యే.. ఇప్పుడు దాడి చేసిన మహిళ పుష్ప. అయితే ఆస్తిని తన పేరు మీద బదిలీ చేయాలని కోరిదంట. అందుకు సుఖ్‌దేవ్ ఒప్పుకోలేదు.. తనకు మరొ కుమారుడు ఉన్నాడని చెప్పారు. దీంతో నడిరోడ్డు మీద హంగామా చేసింది. ఉండేందుకు గది ఇచ్చినా ఒప్పుకోలేదు. మామపై దాడికి దిగింది.

మామపై దాడి
మామ అంటే తండ్రితో సమానం.. కానీ పుష్ప అలా అనుకోలేదు. తనకే ఆస్తి మొత్తం కావాలని అనుకుంది. తన మరిది గురించి కూడా ఆలోచించలేదు. ఆస్తి కావాలని కోరగా.. మామ తిరస్కరించాడు. దీంతో పగ పెంచుకుని దాడికి దిగింది. రోడ్డుపై చెప్పుతో దాడి చేసింది. కానీ ఆ వృద్దుడు మాత్రం వినలేదు. మరో కుమారుడికి అన్యాయం జరుగుతుందని అనుకున్నాడు. తనపై దాడి చేసినా ఒర్చుకున్నాడు.












Click it and Unblock the Notifications