లేడీ లాయర్‌పై రేప్‌యత్నం, హత్య: వాచ్‌మన్ పనే

ముంబై: ముంబైకి చెందిన మహిళా న్యాయవాది పల్లవి పుర్కాయస్తపై అత్యాచారయత్నం, హత్య కేసులో ముంబై సెషన్స్ కోర్టు భవనం సెక్యూరిటీ గార్డును దోషిగా ప్రకటించింది. చొరబాటు, అత్యాచారయత్నం, హత్యలకు సంబంధించి సజ్జాద్ ముఘల్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించింది.

దోషిగా జులై 3వ తేదీన శిక్షను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు వెలువడగానే దోషిగా మరణశిక్ష విధించాలని పల్లవి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆరోపణల విషయంలోనూ నిందితుడిని కోర్టు దోషిగా తేల్చిందని, తీర్పుతో తాము సంతృప్తి చెందామని పల్లవి తండ్రి అతను పుర్కాయస్త అన్నారు.

Watchman found guilty in Pallavi Purkayastha murder case

మరణశిక్ష విధించాల్సిందేనని, ఈ కేసులో దోషికి శిక్ష పడినప్పుడే ఇతరులు అటువంటి నేరాలు చేయడానికి భయపడుతారని ఆయన అన్నారు. ఈ సంఘటన 2012 ఆగస్టు 9వ తేదీన జరిగింది. సజ్జాద్ ముఘల్ పల్లవిని చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

ముంబై శివారులోని వాదాలాలో గల హిమాలయన్ హైట్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సజ్జాద్ ముఘల్ అత్యాచార యత్నానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన ఎదురు కావడంతో పల్లవిని చంపేశాడు. ముఘల్ ఆ సమయంలో 22 ఏళ్ల వయస్సువాడు. అతను జమ్మూ కాశ్మీర్‌కు చెందినవాడు.

డుప్లికేట్ తాళం చెవులతో తలుపులు తెరిచి లోనికి ప్రవేశించి, పల్లవిపై అతను అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు. పర్షాన్ ఖాన్ కంపెనీ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి సలహాదారుగా పనిచేస్తుండేది. ఆమె తండ్రి ఐఎఎస్ అధికారి. వ్యవసాయ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+