PoK పై కేంద్ర ప్రభుత్వం సంచలనం..!!

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి చొరబాట్లు సైతం చోటు చేసుకుంటోండటంతో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటోంది. రెప్ప వాల్చకుండా పహారా కాస్తోంది.

ఈ పరిణామాల మధ్య రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరో సంచలన ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టం చేశారు. పీఓకేలో నివసించే మెజారిటీ ప్రజలు భారత్ వైపు చూస్తోన్నారని, సత్సంబంధాలను కోరుకుంటోన్నారని అన్నారు. భారత్ తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రతి ఒక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ పౌరుడూ భావిస్తోన్నాడని అన్నారు.

We are committed to the resolve of One India Great India says Rajnath Singh

దేశ రాజధానిలో ఏర్పాటైన సీఐఐ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రాజ్ నాథ్ సింగ్. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ అంశాన్నీ ప్రస్తావించారు. పాకిస్తాన్ తో తలెత్తిన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యల గురించి వివరించారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ వైపే ఉన్నారని, వారిని కొంతమంది తప్పుదారి పట్టించారని, అలాంటి వాళ్ల వల్లే సమస్యలు ఉత్పన్నమౌతోన్నాయని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అక్కడ నివసిస్తోన్న భారత సోదరుల పరిస్థితి మహారాణా ప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ మాదిరిగానే ఉంటోందని పేర్కొన్నారు.

భారతదేశం ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్నే కోరుకుందని, ప్రజల మధ్య ప్రేమ, ఐక్యత ఏర్పడటానికి ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్.. భారత్ లో ఓ భాగమని తేల్చి చెప్పారు రాజ్ నాథ్ సింగ్. తాను భారత్ లో విలీనం అయ్యానంటూ పీఓకే ప్రకటించుకునే రోజు ఎంతో దూరంలో లేదని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.

భారత్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏకీకరణ.. ఈ దేశ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడం ఎంత ప్రమాదకరమో పాకిస్తాన్ కు తెలిసి వచ్చి ఉంటుందని ఆయన అన్నారు.

పాకిస్తాన్ దానికి తగిన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆ దేశం గ్రహించిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వ్యూహాన్ని మార్చామని, ఉగ్రవాదులపై దాడులకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చామని ఆపరేషన్ సింధూర్ ను ఉద్దేశించి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+