వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు ఈ భార్యలు వద్దు మహాప్రభో.. పూజలు చేసిన భార్యాబాధిత సంఘం

|
Google Oneindia TeluguNews

వివాహ బంధం చాలా పవిత్రమైనది. వివాహ బంధంలో భార్యాభర్తలు ఇద్దరూ ముఖ్యమే. కానీ ఆధిపత్య ధోరణి భార్యాభర్తల మధ్య ఘర్షణలకు కారణంగా మారింది. ఇక తాము వేదిస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఘర్షణలకు దిగటం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవటం, విడాకులు తీసుకోవటం నిత్య కృత్యంగా మారింది.

ఒకప్పుడు భర్తల బాధితులు.. ఇప్పుడు భార్యా బాధితులు

ఒకప్పుడు భర్తల బాధితులు.. ఇప్పుడు భార్యా బాధితులు


ఒకప్పుడు వివాహమైన తర్వాత భర్తలు వేధిస్తున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గృహ హింసకు గురవుతున్న మహిళల కోసం ప్రభుత్వం కూడా అనేక చట్టాలను తీసుకు వచ్చింది. అత్తవారింట గృహ హింసకు గురయ్యే మహిళలకు రక్షణ కల్పించడానికి అనేక చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే భార్యను వేధిస్తున్న భర్తల కంటే ఇటీవల భర్తలను వేధిస్తున్న భార్యల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అనేక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తమకు రక్షణ లేదని భార్యా బాధితులు వాపోతున్నారు.

మహారాష్ట్రలో భార్యా బాధిత సంఘం భార్యలు వద్దంటూ పూజలు

మహారాష్ట్రలో భార్యా బాధిత సంఘం భార్యలు వద్దంటూ పూజలు

తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో సోమవారం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. తమ భార్యలు వద్దంటూ భార్య బాధితుల సంఘం సభ్యులు తమ ఆవేదనను వెళ్ళగక్కారు. ఏకంగా ఓ ఆలయానికి వెళ్లి మాకు ఈ భార్యలు వద్దు మహాప్రభో అంటూ పూజలు నిర్వహించారు. సాధారణంగా వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు 7 జన్మల కు ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు. అయితే 7 జన్మలు కాదు 7 సెకన్లు కూడా ఈ పెళ్ళాలు మాకొద్దు అంటూ భార్య బాధితుల సంఘం సభ్యులు పూజలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

 సంఘాలు పెట్టి మరీ తమ గోడు చెప్పుకుంటున్న భార్యా బాధితులు

సంఘాలు పెట్టి మరీ తమ గోడు చెప్పుకుంటున్న భార్యా బాధితులు

సీత బాధ సీత ది... పీత బాధ పీతది అన్నట్టు మమ్మల్ని భార్యలు తెగ వేధిస్తున్నారంటూ అనేక మంది పురుషులు ఇటీవల కాలంలో భార్య బాధితుల సంఘాలు పెట్టి మరీ బయటకు వస్తున్నారు. పెళ్ళాల టార్చర్ తట్టుకోలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నామని తెగ బాధపడుతున్నారు. అంతేకాదు భార్యల తీరుపై నిరసనలు, ఆందోళనలు తెలుపుతూ బాధితులంతా ఒకరికొకరు అండగా నిలబడి భార్యల పైన పోరాటానికి రెడీ అయ్యారు.

English summary
A strange incident took place in Aurangabad, Maharashtra. The members of the Wife Victims' Association went to a temple together and performed pujas saying that we do not want these wives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X