పార్లమెంట్లో చీరలపై మాట్లాడుకుంటాం: సుప్రియా షాక్
న్యూఢిల్లీ: లోకసభ పార్లమెంటు సభ్యురాలు, సీనియర్ ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాసిక్‌లో విద్యార్థినులు, యువతులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. పార్లమెంటులో తాము అప్పుడప్పుడు చీరలు తదితరాల గురించి మాట్లాడుకుంటామన్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎంపీలుగా తాము పార్లమెంటులో చీరలు, ఫేసియల్స్ పైనే మాట్లాడుకుంటామన్నారు. ఓ వైపు కీలక అంశాలపై సీరియస్‌గా చర్చ జరుగుతున్నా తాము మాత్రం చీరల పైనే ముచ్చట్లాడుకుంటామన్నారు.

అంతేకాక పురుష ఎంపీలు చీరలపై చర్చలేంటని తమపై కామెంట్లు విసురుతున్నా కూడా వాటిని పట్టించుకోమన్నారు. పట్టించుకోకపోవడమే కాక తమపై కామెంట్లు సంధించే పురుష ఎంపీలకు తమదైన శైలిలో ఎదురు దాడి చేస్తామన్నారు.
సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇంతా చెప్పిన ఎంపీ సుప్రియా సూలే విద్యార్థినులతో మాట్లాడుతూ... భవిష్యత్తులో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే, మాలాగా ముచ్చట్లాడుకోవద్దని హితబోధ చేశారు.












Click it and Unblock the Notifications