మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు, సీఎం మీద బాంబు వేసిన తమిళనాడు మంత్రి !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి తన మంత్రుల నుంచే సమస్యలు ఎదురౌతున్నాయి. పన్నీర్ సెల్వంతో ఎలా రాజీ కావాలని అంటూ ఓ వైపు, టీటీవీ దినకరన్ ను ఎలా కట్టడి చెయ్యాలని మరో వైపు ఎడప్పాడి పళనిసామి సతమతం అవుతున్నారు.
ఈ సందర్బంలో స్వాత్రంత్ర్య దినోత్సవం రోజు ఓ మంత్రి ఎడప్పాడి పళనిమి మీద బాంబు వేశారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి మాకు పూర్తి స్థాయి ఎమ్మెల్యేల మద్దతు లేదని తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ స్వయంగా మీడియాకు చెప్పడంతో పళనిసామి వర్గం హడలిపోయింది.

మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ప్రభుత్వం సుస్థిరంగాఉండాలంటే 117 మంది ఎమ్మెల్యేలు అవసరం అని చెప్పారు. అయితే మాకు ఇప్పుడు 115 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ అన్నారు.
త్వరలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాగూటికి చేరుకుంటారని మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ వివరించారు. మరో వైపు టీటీవీ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక విభాగం ప్రధాన కార్యదర్శి పూహళేంది మీడియాతో మాట్లాడుతూ మా వర్గంలోని నలుగురు ఎమ్మెల్యేలను మంత్రి ఉదయ్ కుమార్ మభ్యపెట్టి తీసుకెళ్లారని, త్వరలో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది మా గూటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications