కులం కార్డుతో పోటీ చేస్తారా ?, రిసార్టు రాజకీయాలు అవసరం లేదు, సిద్దూ !

బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ఎవ్వరి మద్దతు అవసరం లేకుండా అధికారంలోకి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. భజరంగ్ ధళ్ వివాదం అది ఒక వివాదమే కాదని, భజరంగ్ దళ్ విషయంలో బీజేపీ నాయకులు రాద్దాంతం చేశారని సిద్దరామయ్య ఆరోపించారు.

మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య తాను ప్రజల నాడి గుర్తించి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే ఉన్నానని, సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వచ్చాయని, అదే మేము కోరుకుంటున్నామని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

we dont need resort politics, says former CM Siddaramaiah

కర్ణాటక ప్రజలకు బీజేపీ మీదవిరక్తి పెరిగి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరిగిందని, అందుకే బీజేపీని ఇంటికి పంపిస్తున్నారని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. వరుణా నియోజక వర్గంలో తాను భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని, తనకు అక్కడ సోమణ్ణ పోటీనే కాదని, కులం కార్డుతో, డబ్బు అహంకారంతో బీజేపీ నాయకులు సోమణ్ణను అక్కడ పోటీకి నిలిపారని సిద్దరామయ్య ఆరోపించారు.

వరుణా నియోజక వర్గ ప్రజలకు సోమణ్ణ ఏం చేశాడు అని అక్కడి ప్రజలు ఆయనకు ఓటు వెయ్యాలని సిద్దరామయ్య ప్రశ్నించారు. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టిపోటీ ఉందని, అక్కడ బీజేపీ మాకు పోటీనే కాదని, ఆ ప్రాంతంలో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

కర్ణాటక కరావళి ప్రాంతంలో మేము ఊహించినదానికంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి రిసార్ట్ రాజకీయాలు ఉంటాయా ?, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఎలా కాపాడుకుంటారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సిద్దరామయ్య ఆ విలేకరి మీద చిందులు వేశారు.

నువ్వు బీజేపీ మనిషివా ?, ఎందుకు అలాంటి డౌట్ నీకు వచ్చింది ?. మాకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని మేము చెబుతున్నాము, సర్వేలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో రిసార్టు రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది ?, ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలో నీకు తెలీదా అంటూ ఆ విలేకరి మీద అసహనం వ్యక్తం చేసిన సిద్దరామయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+